ప్రపంచాన్ని క్షణకాలం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది మాయదారి కరోనా వైరస్. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిపోయింది.  మానవాళికి ప్రబల శత్రువుగా పరిణమించిన కరోనా మహమ్మారి ఇప్పుడు 204 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,14,256గా నమోదైంది. ఇప్పటివరకు 52,982 మంది మృతి చెందారు.  అయితే కరోనాని అరికట్టడానికి ఎన్నో రకాలుగా వైద్యు నిపుణులు కృషి చేస్తున్నారు.

 

కరోనా వైరస్ వ్యాపించాక... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  ఈ BCG ప్రస్తావన తెచ్చింది. ఇది కరోనా వైరస్‌ని చంపుతుందేమో పరిశీలించమని సూచించింది. వెంటనే మెల్‌బోర్న్‌లో అంతర్జాతీయ బృందాలన్నీ ఒక్కటై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించాయి. అయితే ఫలితాలు ఎలా ఉంటాయో పర్యవేక్షిస్తున్నారు. ఈ టీబీ వ్యాక్సిన్  మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిలా మారుతుంది. అందుకే మొత్తం 4000 మంది హెల్త్ కేర్ వర్కర్లు తమకు తాముగా ఈ ఆరు నెలల ట్రయల్‌లో పాల్గొన్నారు.  

 

ఈ పరిశీలన సోమవారం నుంచి మొదలైంది... వచ్చే ఆరు నెలలు పరిశీలిస్తారు.  తక్కువ రేటు ఉండే ఈ వ్యాక్సిన్‌ను ఏటా 13 కోట్ల మంది కొత్తగా పుట్టిన పిల్లలకు ఇస్తున్నారు. తద్వారా వాళ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్న విషయం తెలిసిందే.  తాజాగా కరోనాని కట్టడి చేయడానికి మరిన్ని ప్రయోగాలు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. కరోనాని అరికట్టగలిగే శక్తి మనిషి సాధించినట్లే అంటున్నారు. అందరూ సక్సెస్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నారు. 

 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: