కరోనా నిజానికి అందర్నీ గజగజలాడిస్తున్న రక్కసి ఓ వైపు అయినా.... మరో వైపు అందరికీ మంచి పాఠాన్ని అందిస్తున్న గురువు. ఏదీ అగ్ర రాజ్యం కాదు... అమెరికా అసలు కాదు. ఆరోగ్య కోణంలో ముందుంటేనే అన్నింటిలో ఉన్నట్టు కాబట్టి అమెరికా ఇక మీద అగ్ర రాజ్యమా ..? యుద్ధం అంటే తుపాకీలు, బాంబులు, మిసైల్స్ కాదు. అతలాకుతలం చేయడమే కాబట్టి చైనా ఇలా మొదలు పెట్టింది. అలానే వీధిలో శవాల దిబ్బల్ని చూస్తేనే తెలుస్తోంది యూరోపియన్స్ తెలివితేటలు.

 

డబ్బులతో, కార్పోరేట్ హాస్పటల్స్ తో కాదు అంతా మన రోగ నిరోధక శక్తిలో ఉంది అంతా కూడా. అందరూ స్వార్ధపరులు ఆహారానికి కొరత వచ్చి, ధరలు పెరిగితే...వైద్యో నారాయణే హరి అనేదే నిజం. పాస్టర్లు, స్వాములు, బాబాలు కాదు. మనుష్యులే ఈ భూమికి వైరస్లు. 

 

మనుష్యులు లేకపోతే ఈ భూమి ఏడాదిలో కోలుకుంటుందిట. సినిమా తారలు, క్రికెటర్లు, నాయకులూ కాదు ముఖ్యం. సైంటిస్ట్స్, డాక్టర్స్, రైతులే విలువైనవాళ్లు. అమెజాన్ వాడు కాదు వీధి చివర కిరాణా కొట్టు వాడే ఆదుకునే ఆపద్భాందవుడు. అసలు వాడుకునే వాడు లేకపోతే అరబ్ దేశాల్లో ఆ తవ్వి తీసే చమురు వ్యర్ధమే. మనిషి బంధీ అయ్యిపోయాడు జంతువులు పక్షులు బయట తిరుగుతున్నాయి.

 

కాలుష్యం చేస్తూ బయట తిరిగే పని చెయ్యక్కర్లేదు. ఇంట్లో కూర్చుని కూడా చెయ్యవచ్చు. జంక్ ఫుడ్ లేకపోయినా కూడా పిల్లలు బ్రతకచ్చు అని చెప్పింది. చిన్న నేరాలకు కూడా జైళ్లల్లో ఉంచనక్కర్లేదు. ఆరోగ్యంగా జీవితాన్ని సాగించడం పెద్ద కష్టం ఏం కాదు. కేవలం గృహిణే కాదు అంతా కలిసి ఇంటి పని చేసుకోవచ్చు. ప్రాణభయం తరుముతుంటే ఆస్తులు కాస్త ధైర్యాన్ని కూడా ఇవ్వడానికి పనికి రాలేదు.

 

సామాజానికి కావాల్సినవి స్టేడియంలు కావు ఆసుపత్రిలు, ల్యాబులు, స్కూల్సు. మీడియా వీక్షణం, పఠనం ఒక చెత్త వ్యసనం ఇలా ఎన్నో ఉన్నాయి. టైం వస్తే చాలు ఈ నాయకుడికి రక్షణ లేదు. రోగం దగ్గర ఎవ్వరైనా భయంతో వణికి పోవాలసిందే.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: