ప్రపంచం అంతా కరోనా పేరు వింటే గజ్జున వణికి పోతున్నారు. మానవాళికి ప్రబల శత్రువుగా పరిణమించిన కరోనా మహమ్మారి ఇప్పుడు 204 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,14,256గా నమోదైంది. ఇప్పటివరకు 52,982 మంది మృతి చెందారు. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,242 కాగా, మృతుల సంఖ్య 13,915కి పెరిగింది. స్పెయిన్ లోనూ ఇదే తరహా భయానక పరిస్థితి నెలకొంది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,065 కాగా, మృతిచెందిన వారి సంఖ్య 10,348. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్న ఈ సమయంలో కరోనా వైరస్ తాను ఊహించిన దానికంటే చాలా 'వరస్ట్' అని జర్మనీలోని బెర్లిన్ జిల్లా మేయర్ స్టీఫెన్ వాన్ డాస్సెల్ అన్నారు.

 

అయితే ఈ కరోనా వైరస్ ని తన పార్టనర్ నుంచి కావాలనే ఎక్కించుకున్నానని.. తాను ఊహించిన దాని కంటే అనారోగ్యం ఎక్కువ కాలం ఉందని తెలిపారు. అయితే తన పార్ట్ నర్ నుంచి కరోనా ఇన్ ఫెక్షన్ ఎక్కించుకున్న సమయంలో వైరస్ ను ఎదుర్కొనే నిరోధక శక్తిని సాధించాలనే ఉద్దేశం ఉందని... కానీ దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉందని అన్నారు. తన నుంచి వైరస్ ఎవరికీ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు.  తన నుంచి వైరస్ ఎవరికీ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు.

 

ఈ వైరస్ సామాన్యమైదికాదని.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఆ ఇన్ఫెక్షన్ సోకకుండా నిలువరించలేమని తెలిపారు.  ప్రపంచం కోసమే తాను ఈ పని చేశానని  చెప్పారు. కరోనా విస్తరణను కట్టడి చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా బయటపడిన తర్వాతే క్వారంటైన్ నుంచి బయటకు వస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే ఓ వైపు కరోనాని ఎలా కట్టడి చేయాలని.. ప్రపంచ వ్యాప్తంగా తలలు పట్టుకొని కూర్చుంటే..  కావాలనే వైరస్ ను సోకించుకున్న స్టీఫెన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: