దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య వందల్లో పెరుగుతోంది. ప్రతిరోజు దేశంలో 300 నుంచి 400 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు విరుగుడు కనిపెట్టడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. చైనా ఇప్పటికే కరోనాకు మందు కనిపెట్టి పరిశోధనలు చేస్తోంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా కరోనాకు మందు కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలోని ఒక యూనివర్సిటీ పరిశోధనలు చేసి కరోనాకు మందు కనిపెట్టడంలో సక్సెస్ అయింది. 
 
 
అమెరికాలోని పిట్స్ బర్గ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు కరోనాకు విరుగుడు కనిపెట్టారు. ఆ మందును ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. త్వరలో ఆ వ్యాక్సిన్ ను మనుషులపై కూడా ప్రయోగించనున్నారు. ఎలుకలపై వ్యాక్సిన్ ను ప్రయోగించగా వాటిలో వైరస్ ను ఎదుర్కోవడానికి కావాల్సిన యాంటీ బాడీలు ఉత్పన్నమయ్యాయి. రాబోయే మూడు నెలల్లో యూనివర్సిటీ పరిశోధకులు మనుషులపై కూడా ప్రయోగాలు చేశారు. 
 
మనుషులపై క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే మాత్రం ఏడాదిలోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మనుషులపై చేసే క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే మాత్రం ఒక సంవత్సరంలోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ కు మందును కనిపెట్టిన పరిశోధకులు కరోనా వైరస్ జాతికి చెందిన సార్స్, మెర్స్ లకు పని చేశారు. స్పైక్ ప్రోటీన్ కరోనాను ఎదుర్కోవడంలో కీలక పాత్రను పోషిస్తుందని పరిశోధకుల్లో ఒకరైన ఆండ్రియా గంభోట్టా తెలిపారు. 
 
శరీరంలో యాంటీ బాడీలు ఉత్పన్నం అయితే అవి కరోనా వైరస్ ను తటస్థ స్థితికి తీసుకొనిరావడానికి సరిపోతాయని చెప్పారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ లు, మందులు లేకపోవడం వల్ల బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. దేశంలో ఇప్పటివరకూ 2,567 మంది కరోనా భారీన పడగా 72 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: