కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఇలా అన్ని అభివ్రుధ్ధి చెందిన దేశాల్లో తన ప్రతాపం చూపించిన కరోనా వైరస్ మహమ్మారి ఇపుడు భారత్ మీద పడగ విప్పినట్లుగానే  ఉంది. లేకపోతే కేవలం రెండు రోజుల తేడాలో కరోనా బాధితుల నంబర్లు ఒక్కసారిగా డబుల్ అవడమేంటి.

 

ఇపుడున్న సమాచారం ప్రకారం భారత్ లో కరోనా భాధితుల కేసులు 2301 ఉన్నాయి. మరణాలు 70 దాకా ఉన్నాయి. రానున్న రోజుల్లో అంటే కేవలం పది రోజులో తేడాలో ఈ రెండు వేల నంబర్ కాస్తా పది వేలకు పై దాటుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు కేవలం మూడు వందల కేసులు మాత్రమే భారత్ లో ఉన్న సంగతి గమనం లోకి తీసుకోవాలి.

 


ఇక  నాలుగైదు రోజుల క్రితం వరకూ కూడా రోజుకు ముప్పయి నలభై కేసులు మాత్రమే పెరుగుదల కనిపిస్తూ గ్రాఫ్ నెమ్మదిగా సాగుతూ వచ్చింది. అది కాస్తా ఒక్కసారిగా వందల్లోకి పరుగులు తీస్తోంది. దాంతో ఇదే రకమైన దూకుడు కనుక కొనసాగితే మాత్రం భారత్ లో కరొనా వేగం ఊహించనంతగా ఉంటుందని వైద్య రంగం నిపుణులు భయపడుతున్నారు.

 

మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా ఇపుడు కొత్తగా రాజస్థాన్, దక్షిణాదిన తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా జోరుగా కేసులతో పోటీ పడుతున్నాయి. మరో వైపు మధ్యప్రదేశ్ లో కూడా కరోనా వీర విహారం చేస్తోంది. ఇవన్నీ చూసినపుడు కరోనా దూకుడు మిగిలిన దేశాల్లో సాగిన తీరుని పోల్చి చూసుకున్నపుడు కేసులు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు.

 

ఇదంతా లాక్ డౌన్ పీరియడ్ లో జరుగుతున్న కధ, అంటే ఇపుడే పెరుగుదల ఈ స్థాయిలో ఉంటే రేపటి రోజున లాక్ డౌన్ ఎత్తేస్తే కనుక ఇక మరింత భయానకంగా పరిస్థితి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వణికిపోయేలా అలారం మోగుతోంది. భారత్ ఇపుడు స్పీడుగానే  డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతోంది. ఇక  అప్రమత్తం కావాల్సిందే. వైద్య సేవలు మెరుగుపరచుకుని ఎంత వీలైతే అన్ని కరోనా వైద్య  పరీక్షలు చేస్తూ ముందుకు రాకపోతే కరోనా వేగాన్ని ఇకపైన ఎక్కడా అందుకోవడం అసాధ్యమనే నిపుణులు  అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: