కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసినదే. దేశంలో లాక్ డౌన్ విధించటం వలన ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం పడింది. దింతో కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం మాత్రమే అందజేశారు. అటు సినీ పరిశ్రమ ఇటు రాజకీయ నాయకులు కూడా కరోనా కట్టడికి తమ వంతు సాయంగా విరాళాలను అందజేశారు. ఇప్పుడు అదే తరుణంలో పారిశ్రామిక వేత్తల సమాఖ్య కూడా భారీ విరాళాన్ని కేటీఆర్‌ కు అందజేశారు.

 

రాష్ట్రములో కరోనా మహమ్మారి శర వేగంగా వ్యాపిస్తుంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా బారిన పడి ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఈ వ్యాధి వ్యాపించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ మహమ్మారి తెలంగాణాలో పంజా విసురుస్తూనే ఉంది.

 

కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా సీఎం సహాయ నిధికి టీఐఎఫ్ రూ.1,22,42,419లను విరాళంగా అందజేశారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్  ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.

 

అంతే కాకుండా వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి రెసిడెన్షియల్ పాఠశాల డైరెక్టర్ కొడాలి విజయరాణి తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.6 లక్షలను విరాళంగా అందజేశారు. అంతేకాకుండా మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ అనీల్ రూ.25 లక్షలు, డ్యూక్ బిస్కెట్స్ యాజమాన్యం రూ.25 లక్షలు ఇచ్చారు.

 

నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్‌ లో శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ను కలిసి ఇందుకు సంబంధించిన చెక్కును స్వయంగా అందజేశారు. రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకున్న సినీ పరిశ్రమలో కింది స్థాయి కార్మికులను ఆదుకొనేందుకు మరో రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: