తెలుగుదేశంపార్టీ ఏదో చెద్దామని అనుకుంటే ఇంకేదో అయినట్లుంది వ్యవహారం చూస్తుంటే.  మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని గబ్బు పట్టించటమే ఏకైక టార్గెట్ గా చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు సమస్త టిడిపి నేతలు తెగ కష్టపడుతున్నారు. అయితే టిడిపి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు రివర్సవుతునే ఉన్నాయి. తాజాగా ఇటువంటి ప్రయత్నమే ఒకటి బెడిసి కొట్టటంతో చంద్రబాబు బండారమే బయటపడింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే లాక్ డౌన్ సందర్భంగా జగన్ తీసుకున్న నిర్ణయాలపై  తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత దూళిపాళ నరేంద్ర తీవ్రమైన ఆరోపణలు చేస్తు ఓ లేఖ రాశాడు. అందులో ప్రభుత్వ ఆదాయం పోయిన ఆర్ధిక సంవత్సరం కన్నా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఎంత పెరిగిందో లెక్కలతో సహా వివరించాడు. నరేంద్ర లెక్కల ప్రకారం రూ. 30 వేల కోట్ల ఆదాయం పెరిగినా ఉద్యోగులకు జీతాలు రెండు వాయిదాల్లో  ఇవ్వటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంటే వీళ్ళ ఉద్దేశ్యమేమిటంటే మొదటి నుండి జనాలను, ఉద్యోగులను జగన్ పై రెచ్చగొట్టడమే అని అర్ధమవుతోంది.

 

అయితే అనుకోకుండా టిడిపి నేత ఓ నిజాన్ని అంగీకరించాడు. అదేమిటంటే చంద్రబాబు కన్నా జగన్ మంచి అడ్మినిస్ట్రేటర్ అని. ఎలాగంటే ఇంతకాలం చంద్రబాబు అండ్ కో జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసారో అందరికీ తెలిసిందే. జగన్ వల్ల రాష్ట్రం భ్రష్టపట్టిపోతోందని, ఆదాయాలు పడిపోతున్నాయని ఇలా.. చాలా ఆరోపణలే చేస్తోంది. ఒకవైపు ఆదాయాలు పడిపోతున్నాయని చెప్పిన ఇదే టిడిపి ఇపుడు ప్రభుత్వ ఆదాయం 30 వేల కోట్లు పెరిగిందని ఎలా చెబుతోంది ? అన్నదే అసలైన ప్రశ్న.

 

అంటే ఇంతకాలం జగన్ పై టిడిపి చేస్తున్నదంతా అబద్ధాలే అని తేలిపోయింది. వైసిపి ఆధ్వర్యంలోని  ప్రభుత్వ ఆదాయం పెరుగుతోందంటే జగన్  పరిపాలన బాగుందని ఒప్పుకున్నట్లే కదా ?  అంటే ఇపుడు జగన్ కు రాసిన లేఖలో దూళిపాళ తమ అధినేత చంద్రబాబు పరువు తీసేసినట్లే అని టిడిపి నేతలే చెప్పుకుంటున్నారు. ఇంతకాలం తాము చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఓ లేఖ కారణంగా గాలికి కొట్టుకుపోయిందంటూ తమ్ముళ్ళ తలలు పట్టుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: