దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రతిచోట కరోనా చేస్తున్న కరాళ నృత్యానికి ప్రజలు భయంతో వణికి పోతున్నారు.  ఈ కోరానాకి మందులు లేదు.. జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి.  మన ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకుంటే.. కరోనా ప్రభావం అంతగా పడకుండా ఉంటుంది. అయితే దేశ వ్యాప్తంగా  ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కు లింకుతో కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. దేశంలో వివిధ ప్రాంతాలకు ఈ కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 154 కేసులు నమోదు కాగా... 9 మంది మరణించారు.

 

 

ఏపీలో కేసుల సంఖ్య 161కి చేరుకోగా... ఒక మరణం సంభవించింది.  ఇదిలా ఉంటే..  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 182 ల్యాబ్ లు పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్) సంస్థ వెల్లడించింది. వీటిలో 130 ప్రభుత్వ ల్యాబ్ లు అని ఐసీఎంఆర్ పేర్కొంది. గడచిన 24  గంటల్లో భారత దేశ వ్యాప్తంగా  8000 శాంపిల్స్ పరీక్షించామని   ఐసీఎంఆర్ తెలిపింది.  కాగా, అటు తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.

 

కొత్తగా 102 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 411కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 2282 యాక్టివ్ కేసులు ఉన్నాయి... ఇక, కరోనా బారిన పడి కోలుకున్న 191 మంది ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు 72మంది మృతి చెందారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టినా  “కరోనా వైరస్” చాప కింద నీరులా విస్తరించడం ఆందోళన కలిగించే విషయం.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: