తాజాగా 5 కొత్త కరోనా కేసులు kashmir - SRINAGAR/JAMMU' target='_blank' title='జమ్మూ అండ్ కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జమ్మూ అండ్ కాశ్మీర్ లో నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 75 కి చేరుకుంది. అస్సాం రాష్ట్రంలో 3 కొత్త కేసులు నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 17 కి చేరుకుంది. ఒడిశా సర్కార్ ఈ రోజు రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు కటక్, భువనేశ్వర్, భద్రక్ లలో అత్యంత కఠినమైన లాక్ డౌన్ కొనసాగనున్నదని ప్రకటించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీలో ఇప్పటి వరకు ఐదుగురు కోవిడ్ 19 వ్యాధి లక్షణాలతో చనిపోయారని... నలుగురు గతంలో చనిపోగా... ఒక్కరు మాత్రం తాజాగా చనిపోయారని... ఆ ఒక్కరు కూడా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్ధన సదస్సుకు హాజరైన వ్యక్తి అని తెలిపారు. ఢిల్లీలో కేవలం 38 లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు నమోదు కాగా పరిస్థితి అదుపులో ఉందని కేజ్రీవాల్ అన్నారు.


ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 102 కేసులు నమోదు కాగా... వారిలో వందమంది ఢిల్లీలోని మతపరమైన సదస్సుకు హాజరైన వారే. అయితే తమిళనాడు రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 411 చేరుకోగా... వారిలో 364 మంది తబ్లీజీ జమాత్‌ వేడుకలో పాల్గొన్నవారే. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 1200 మంది తబ్లీజీ జమాత్‌ వేడుకలో పాల్గొన్నారని... వారందరినీ గుర్తించి క్వారంటైన్ లో ఉంచామని తమిళనాడు హెల్త్ సెక్రటరీ బీలా రాజేష్ తాజాగా ప్రకటించారు.


కేరళ రాష్ట్రంలో కొత్తగా 9 కేసులు నమోదయ్యాయని... వారిలో ముగ్గురు తబ్లీజీ జమాత్‌ వేడుకలో పాల్గొన్నవారిని... ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 295కి చేరిందని కేరళ సీఎం పినరాయి విజయన్ తెలిపారు. 295 మంది కరోనా పీడితులలో 206 మందికి ట్రావెల్ హిస్టరీ ఉందని... మరో ఏడుగురు విదేశీయులని... 14 మంది ఇప్పటికే కోలుకున్నారని... దీన్ని బట్టి చూస్తే తాము కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసినట్టు స్పష్టమవుతుంది అంటూ సీఎం పినరాయి విజయన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 172 మందికి కరోనా పాజిటివ్ కేసులు సోకగా... అందులో 47 మంది తబ్లీజీ జమాత్‌ వేడుకలో పాల్గొన్నవారని తేలింది.


ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పీడితుల సంఖ్య చూసుకుంటే...


ప్రపంచంలో మొత్తం కేసులు: 1,039,158
మరణాలు: 55,164
రికవరీ కేసులు: 220,076

ఇండియాలో మొత్తం కేసులు: 2,686
మరణాలు: 73
కొత్త కేసులు: 143
రికవరీ కేసులు: 192

తెలంగాణలో మొత్తం కేసులు: 154
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9
ఏపీలో మొత్తం కేసులు: 161
మృతులు: 1

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 23
గుంటూరు: 20
కడప: 19
ప్రకాశం: 17
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 14
తూర్పు గోదావరి: 9
చిత్తూరు: 9
అనంతపురం: 2
కర్నూలు: 1

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: