కరోనా వైరస్ నియంత్రణపై చినబాబు లోకేష్ బుర్రకు తోచింది ట్వీట్లలో పెట్టేసి ఆనందం పొందుతున్నాడు. ఇంతకీ లోకేష్ ఆరోపణలు ఏమిటంటే జగన్ ప్రభుత్వం ఇసుక, మట్టి దోపిడిపై మాత్రమే శ్రద్ధ చూపిస్తోందట.  ఈ దోపిడిపై పెట్టిన శ్రద్ధలో 10 శాతం కరోనా వైరస్ నియంత్రణపై పెట్టి ఉన్నా పరిస్దితి రాష్ట్రంలో ఇంత దారుణంగా ఉండేది కాదని పాపం చినబాబు తెగ బాధపడిపోయాడు. ఇప్పటికైనా జగన్ మొద్దునిద్ర, నిర్లక్ష్య ధోరణిని పక్కనపెట్టే వైరస్ నివారణ చర్యలు మొదలుపెట్టాలని సూచించటమే ఆశ్చర్యంగా ఉంది.

లోకేష్ ట్వీట్ చూస్తు ఓ సందేహం వస్తోంది. అసలు చినబాబు ఏపిలోనే ఉన్నాడా ? లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాడా అని. వైరస్ నియంత్రణ విషయంలో జగన్ ప్రతిరోజు యంత్రాంగంతో సమీక్షలు చేస్తునే ఉన్నాడు. యావత్ యంత్రాంగాన్ని వైరస్ నియంత్రణ కోసమే వాడుతున్నాడు.  కాకపోతే చంద్రబాబునాయుడు లాగ ప్రచారం చేసుకోవటం లేదంతే.  వైరస్ వ్యాప్తి  కూడా నియంత్రణలోనే ఉంది. కాకపోతే ఢిల్లీలోని మత ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వారి వల్లే కేసులు ఒక్కసారిగా పెరిగిపోయిందన్న విషయం  అందరికీ తెలుసు.

 

మరి అందరికీ తెలిసిన విషయం చినబాబుకు ఎందుకు తెలీలేదు ? తెలీక కాదు  జగన్ పై ఆరోపణలు చేయాలి కాబట్టే చేస్తున్నాడు. పైగా బాగోలేనిది రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కాదట. జగన్ మానసిక పరిస్ధితే బాగాలేదట. లాక్ డౌన్ విధించిన వారం రోజులకే రాష్ట్ర ఆర్దిక పరిస్దితి బాగాలేదని బీద అరుపులు మానుకోవాలట. లోకేష్ వాదన ఎలుగుందంటే చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు చేసేసి అవసరమైనపుడు  చిప్ప పట్టుకోవాలన్నట్లుంది.

ఖజానాలో నిధులున్నది నిజమే అయినా చేతిలో ఉన్న నిధులు మొత్తాన్ని వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టాయలని లోకేష్ చెబుతున్నాడా ? మరి ఏప్రిల్ లో కూడా లాక్ డౌన్ కంటిన్యు అయితే అప్పుడు పరిస్ధితి ఏమిటి ? అప్పుడు అవసరానికి నిధులెట్లా ? భవిష్యత్ అవసరాలకు డబ్బులు పెట్టుకోవటం కూడా తండ్రి, కొడుకులకు బాధగా ఉందా ? అందుకనే వైసిపి ఎంపి విజయాసాయిరెడ్డి తండ్రి, కొడుకులను వాయించేస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: