ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడి చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చెయ్యాలని పలువురు సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పుడు చాపకింద నీరులా ఆంధ్రప్రదేశ్ లో విస్తరిస్తుంది. ఇప్పుడు దీన్ని కట్టడి చేయకపోతే మాత్రం పరిస్థితులు చాలా ఆందోళన కరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ప్రత్యేక వైద్య బృందాలను పంపే ఆలోచన చేస్తుంది. 

 

త్వరలోనే ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య బృందాలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే సూచనలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అప్పుడు మాత్రమే వైరస్ ని కట్టడి చేయడం అనేది సాధ్యమవుతుంది మినహా మరో మార్గం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ తీవ్రత పెరగకు ముందే కట్టడి చేయడానికి నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పుడు ప్రభుత్వం తో పాటు కేంద్రానికి సూచనలు చేస్తున్నారు. ఏపీలో కేసులు రాబోయే రెండు మూడు రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరణాలు కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయని అంటున్నారు. 

 

అందుకే ఇప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఏపీ లో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు గనుక ప్రత్యేక వైద్య బృందాలతో పాటుగా భారీగా నిధులు ఇవ్వకపోతే మరణాలు పెరుగుతాయని గ్రామ స్థాయిలో కరోనా వైరస్ పెరిగితే మాత్రం చేసేది ఏమీ ఉండదు అని అంటున్నారు. దీనితో పరిస్థితులు దిగాజారక ముందే చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం కేసుల సంఖ్య 161 గా ఉంది. ఇవి రెండు మూడు రోజుల్లో 200 కి వెళ్ళినా సరే ఆశ్చర్యం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: