టీడీపీ అధినేత ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు కరోనా విషయంలో అనవసరంగా తొందర పడుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే విధానం పై చంద్రబాబు నాయుడు కృష్ణా నది వరదల నుంచి ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు. తన సామర్ధ్యాన్ని ఆయన బయటపెట్టుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి గాని ఈ సమయంలో ఆరోపణలు చేయడం భావ్యం కాదు. 

 

కాని చంద్రబాబు మాత్రం పదే పదే మీడియా ముందుకి వచ్చి ఆరోపణలు చేయడంపై టీడీపీ నేతల్లో కూడా అసహనం ఎక్కువగా వ్యక్తమవుతుంది. తన సామర్ధ్యం పదే పదే చెప్పుకోవడానికి ఆయన కష్టపడాల్సిన అవసరం లేదని ఇప్పుడు సలహాలు ఇవ్వడం మినహా ఇతర పనులు అవసరం లేదనే సూచనలు సొంత పార్టీ నుంచే చంద్రబాబుకి వెళ్తున్నాయి. అయినా సరే చంద్రబాబు వెనక్కు తగ్గకుండా పదే పదే ఆరోపణలు ఎక్కువగా చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు అధికార పార్టీ మండిపడుతుంది. ఆయన ప్రజల్లో తాను పెద్ద పని మంతుడ్ని అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. 

 

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడానికి ప్రభుత్వం చాలానే కష్టపడుతుంది అనే విషయం అందరికి అర్ధమవుతుంది. కాని చంద్రబాబు సలహాలు ఇవ్వాల్సిన సమయంలో పదే పదే విమర్శల కోసం సమయం వెచ్చించడం పై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు చులకన అయ్యామని ఇప్పుడు మళ్ళీ చులకన అవ్వాల్సిన అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కొన్ని రోజులు ఏమీ మాట్లాడకుండా ఉండటమే పార్టీకి మంచిది అంటూ సూచనలు ఎక్కువగా చేస్తున్నారు. ఆయన మారాల్సిన అవసరం ఉందని చంద్రబాబుకి కార్యకర్తలు సూచనలు చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: