కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆ వైరస్ కి వాక్సిన్ లేదు, దాంతో దాని దూకుడు లెక్క లేకుండా ఉంది. తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. విళయతాండవం చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నగా నిలబడి మరీ తొడకొడుతోంది. ప్రపంచంలోని 800 కోట్ల మాంది జనాభా కూడా ఏం చేయలేక బిక్కచచ్చిపోతున్నారు.

 

ఇక ప్రపంచమంతా ఒక్క ఎత్తు అయితే ఏపీ మరో ఎత్తు. ఇక్కడ రాజకీయ వైరస్ ఒక్కలా లేదు. దానికి వాక్సిన్ డోస్ ఏ మాత్రం సరిపోవడం లేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు కఠినమైన తీర్పు ఇచ్చినా కూడా ఎక్కడా తగ్గనంటోంది. ఏపీలో వామపక్షాలు నయం అనిపిస్తోంది.

 

వారు తాము చేయాల్సిన సాయం పేదలకు చేస్తున్నారు. ఏమైనా చేయాలని అనిపిస్తే ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అయితే తమ పార్టీ ఆఫీసులు ప్రభుత్వం క్వారంటైన్స్ గా వాడుకోమని గొప్ప‌ ఉదారతను చూపించారు.

 

ఇక కరోనా వైరస్ తరువాత బీజేపీ సైతం సైలెంట్ అయింది. ఆ పార్టీ నాయకులు వీలైతే సహాయ కార్యక్రమాల్లో ఉంటున్నారు. కన్నా లక్ష్మీ నారాయణ వంటి వారు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే మాత్రం జగన్ కి లేఖ రాస్తున్నారు.

 

మరో వైపు టీడీపీ మాత్రం  పొలిటికల్ వైరస్ తో ఏపీని  అతలాకుతలం చేస్తూనే ఉంది. పెద్దాయన, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన చంద్రబాబు ఇంట్లో ఒక్క సెకన్ కూడా  ఉండలేకపోతున్నారులా ఉంది. ప్రతీ రోజూ ఠంచనుగా సాయంత్రం అయితే చాలు మీడియా మీటింగు పెట్టడం కరోనా వైరస్ మీద జనాలను బెదరకొట్టడం, అదే టైంలో జగన్ని వైసీపీ సర్కార్ని తిట్టడం చేస్తున్నారు.

 

మరి ఆయన వద్దకు ఏ రకమైన విషయాలు వస్తున్నాయో తెలియదు కానీ ఆయన మాత్రం విమర్శలు ఘాటుగానే చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని నిన్న ఆరోపణ చేస్తే దానికి వైసీపీ నేత సజ్జల రామక్రిష్ణా రెడ్డి తిప్పికొట్టారు. తాము అసలు ఎవరికీ  ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చారు. ఇక అది తుస్సుమంది.

 


మరో వైపు ఈ విపత్కర పరిస్థితుల్లో  జీతాలు అడగమని  ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. ఇంకో వైపు జనాలను భయపెడుతున్నారు. తమ్ముళ్ళ రాజకీయం చూస్తూంటే ఏపీలో పొలిటికల్ వైరస్ ఈ  టైంలో కూడా ఇంతలా విస్తరించాలా అనిపించకమానదు. నిజమే ఇది ఎవరూ ఊహించని ఉపద్రవం. అగ్ర రాజ్యాలే తట్టుకోలేకపోతున్నాయి. మరి అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు కరోనా అదుపులో  ఫెయిల్ అయినట్లా. 

 

ఈ కీలక సమయంలో సలహాలు ఇవ్వాలి. లేకపోతే మౌనంగా ఉండాలి. కానీ చంద్రబాబు మాత్రం దారుణంగా మాట్లాడుతున్నారు. నోరు చేసుకుంటున్నారు. ఇది ధర్మమా అని మేధావులు కూడా అనేలా బాబు తీరు ఉంది. ఏది ఏం జరిగినా కరోనా వైరస్ ని నియంత్రించాక అసెంబ్లీ సెషన్ ఎక్కువ రోజులు పెట్టుకుని ఒకరికి ఒకరు బాగా  తిట్టుకోవచ్చు. 

 

కానీ ఇది కాని టైం. బాబు మాత్రం షరా మామూలే అంటూంటే తమ్ముళ్ళు తందానా అంటూ విరుచుకుపడుతున్నారు. మొత్తానికి కరోనా వైరస్ కంటే ఈ రకమైన పొలిటికల్ వైరస్ తోనే జగన్ బాధపడుతున్నారులా ఉంది సీన్ చూస్తూంటే ఇదే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: