కొద్ది రోజుల క్రితం 142 సిఐఎస్ఎఫ్ జవాన్లని క్వారంటైన్ లో ఉంచగా... నిన్న నలుగురికి కరోనా పాజిటివ్ అని పరీక్షలలో తేలగా... ఈరోజు 11 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని సిఐఎస్ఎఫ్ ఉన్నత అధికారులు వెల్లడించారు. ముంబై నగరంలోని ఓ ఎలక్ట్రిక్ సప్లై బ్రాంచ్ లో పనిచేసే ఓ ప్రభుత్వ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని తేలగా... తన సహోద్యోగులందరిని క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు మొత్తం 4 కొత్త కేసులు నమోదు కాగా... వారు 75, 70, 26, 23 ఏళ్ల వ్యక్తులని సమాచారం. ఈ నలుగురు వ్యక్తుల లో ముగ్గురు తబ్లీజీ జమాత్‌ వేడుకలో పాల్గొన్నారని తెలిసింది.


చండీగఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా మాట్లాడుతూ... తమ రాష్ట్రం నుండి 107 మంది తబ్లీజీ జమాత్‌ వేడుకలో పాల్గొన్నారని... అయితే వారిలోని 50 మంది నమూనాలను వైద్య పరీక్షలకు పంపించగా... 28 మంది ఫలితాలు లభించగా వారందరికీ కోవిడ్ 19 వ్యాధి సోకలేదని తెలిసిందంటూ మీడియా సమావేశంలో తెలిపారు. ఒడిస్సా రాష్ట్రంలో తాజాగా 3 కొత్త కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 9కి చేరుకుంది. తొమ్మిది మందిలో ఇద్దరు పూర్తిగా కోలుకోగా ఏడుగురు చికిత్సను పొందుతున్నారు.


ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 1203 మంది తబ్లీజీ జమాత్‌ వేడుకలో పాల్గొనగా.. 897 మంది నమూనాలను వైద్య పరీక్షలకు పంపించగా... 47 మంది కి కరోనా వైరస్ సోకిందని తేలింది. పంజాబ్ రాష్ట్రంలో ప్రజలు లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ రోడ్లపైన కి వస్తున్నారు. దాంతో కొన్ని రోజుల క్రితం పోలీసులు వారందరినీ పట్టుకొని మళ్లీ రోడ్డు మీదకు రాకుండా ఒక వ్యక్తిగత బాండ్ ని రాయించుకున్నారు. అయితే తాజాగా వారందరూ మళ్ళి రోడ్లమీద కి వచ్చేసరికి ఆగ్రహానికి గురైన పోలీసులు 11, 100 పై కేసులు నమోదు చేసి నిర్బంధించారు. ఈ విషయాన్ని లుధియానా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశ్విని కపూర్ తాజాగా వెల్లడించారు. పూణే రాష్ట్రంలో గృహనిర్బంధం పాటించమని చెప్పిన పదిమంది కరోనా అనుమానితులు ఈరోజు ఇల్లు వదిలి పారిపోయారు. అయితే వారిపై కేసు నమోదు చేసి వెతుకుతున్నామని పూణే పోలీసులు చెప్పారు. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రూ. 11, 092 కోట్లను అన్ని రాష్ట్రాలకు ప్రకటించింది. కరోనా విపత్తు నిర్వహణలో భాగంగా ఈ మొదటి ప్యాకేజీని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తున్నట్టు ప్రకటించింది.

ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పీడితుల సంఖ్య చూసుకుంటే...

ప్రపంచంలో మొత్తం కేసులు: 1,040,656
మరణాలు: 55,189
రికవరీ కేసులు: 222,240

ఇండియాలో మొత్తం కేసులు: 2752
మరణాలు: 73
కొత్త కేసులు: 209
రికవరీ కేసులు: 192

తెలంగాణలో మొత్తం కేసులు: 154
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9
ఏపీలో మొత్తం కేసులు: 161
మృతులు: 1

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 23
గుంటూరు: 20
కడప: 19
ప్రకాశం: 17
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 14
తూర్పు గోదావరి: 9
చిత్తూరు: 9
అనంతపురం: 2
కర్నూలు: 1

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: