కరోనాతో అగ్రదేశాలన్ని అల్లాడిపోతుంటే.. మన భారతదేశంలో మాత్రం ఈ వైరస్ కాస్త నెమ్మదిగా పయణిస్తుంది.. ఇప్పటికే టెక్నాలజీలో, ఆర్ధిక విషయాల్లో.. ఇలా అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలను శాసిస్తున్న రాజ్యాలు కరోనా దాడికి కుప్పకూలి పోతుండగా.. అసలే దేశ జనాభాలో రెండో స్దానాన్ని ఆక్రమించిన మన ఇండియాలో ఒకవేళ కరోనా విజృంభిస్తే ఆ నష్టాన్ని ఊహించడం చాలా కష్టం.. అందుకే మోదీగారు మొదటి నుండి కూడా కరోనా విషయంలో ప్రత్యేక మార్గాన్ని అవలంభిస్తూ, మనదేశ ప్రజల ప్రాణాలను కాపాడుకుంటు వస్తున్నారు.. నిజమైన నాయకుడని నిరూపించుకుంటున్నాడు.

 

 

కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీగారు 05-04-2020 వ రోజు  రాత్రి 9 గంటల 9 నిమిషాలకు 9 దీపాలు వెలిగించమని చెబుతున్నారు.. ఇలా చెప్పడంలో ఆంతర్యం ఏంటో తెలుసుకుంటే.. అమ్మవారి సంఖ్య తొమ్మిది.. అదెలా అంటే దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు.. తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శమిస్తుంది అమ్మవారు. అందుకే అమ్మవారి సంఖ్య తొమ్మిదిగా చెబుతారు.. ఇకపోతే  05-04 ఆదివారం రోజున వస్తుంది.. అంతే కాకుండా ఆ రోజు వామన ద్వాదశి, మఖ, పుబ్బ నక్షత్రములు సింహరాశి లో సంచరించున్న సమయం.. సూర్య గ్రహానికి సంబంధించిన వారం, రాశి కనుక ఈ సమయంలో దీపం పెడితే భారతదేశంలో ఉన్న ప్రజల ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుంది అని శాస్త్ర వచనం. చెబుతుంది..

 

 

ఇక నిత్యం అమ్మవారి ఉపాసన మార్గం లో ఉండేవారికి ఈ విషయం అర్ధం అవుతుంది. అందుకని అందరూ ఖచ్చితంగా నెయ్యి దీపం పెట్టండి....శుభం కలుగుతుంది అని చెబుతున్నారు.. ఇకపోతే సైన్స్ ప్రకారం కూడా చూసుకుంటే.. ప్రతి ఇంటిలో 9 గంటల, 9 నిమిషాల, 9 సెకన్లకు, 9 దీపాలు వెలిగిస్తే.. ఆ దీపాల కాంతి ఆకాశంలోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయినా అన్ని దీపాల వెలుగులు ఫోటాన్ శక్తులు గా మారుతాయి. అప్పుడు 9 ( నవ) గ్రహాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్ష్య లోకీ వస్తాయి, అలా రావడం వల్ల నవ గ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి...

 

 

అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల.. ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల  33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి అటామిక్ ఎనర్జీ గా మారుస్తారు...ఆ అటామిక్ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది... అదీ మన దీపాల సంస్కృతి, మన సనాతన రహస్యం.. అందుకే మోదీగారు దీపాలు వెలిగించండని సెలవిచ్చారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: