కరోనా ... ఇప్పుడు ప్రపంచంలో దీన్ని మించిన హాట్ టాపిక్ లేదు. కరోనా మన కాలంలో చూసిన అతి పెద్ద మహమ్మారి.. మన జీవితాలను ఈ దశాబ్ద కాలంలో ఇంతగా ప్రభావితం చేసిన అంశం మరొకటి లేదు. మరి ఈ కరోనా ప్రభావం మన జీవితాలపై ఎంత కాలం ఉంటుంది.. కరోనా భయం ఇంకెన్నాళ్లు..

 

 

మళ్లీ ఈ కరోనా ను మరిచిపోయిన జనం సాధారణ జీవితం గడిపేందుకు ఇంకెన్నాళ్లు పడుతుంది.. ఈ ప్రశ్నలకు మీకు సమాధానం తెలుసా... కరోనా మహమ్మారి గురించి మరిచిపోయి జనం సాధారణ జీవితం గడిపేందుకు ఇంకా కనీసం ఏడాది సమయం పడుతుందని ఓ అంచనా. ఇది ఓ సర్వేలో జనం వెలిబుచ్చిన అభిప్రాయం.

 

 

కరోనా భూతం ఎప్పటికి వదులుతుందో తెలియదు. ఒక వేళ వదిలినా.. కరోనా అదుపులోకి వచ్చినా.. దీని ప్రభావం నుంచి బైటపడేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పట్టేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ మనుషులను భయపెట్టిన అతి పెద్ద వ్యాధుల జాబితాలో కరోనా అప్పుడే ప్లేస్ సంపాదించేసిందట. క్యాన్సర్, ఎయిడ్స్‌ను కూడా దాటేసిందట. మార్కెట్‌ రీసెర్చ్, అనాలిసిస్‌ సంస్థ వెలాసిటీ ఎంఆర్‌ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

 

 

మార్చి 19–20 మధ్య హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఈ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. ఇందులో మొత్తం 2,100 మంది పాల్గొన్నారు. ఇంకా ఈ సర్వేలో జనం ఏం చెప్పారంటే.. కరోనా సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు ఎక్కువగా టీవీ, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు, దిన పత్రికలను ఆశ్రయిస్తున్నారట. అయితే విశ్వసనీయ సమాచారం కోసం టీవీలు, దినపత్రికలపైనే ఎక్కువగా డిపెండ్ అవుతున్నారట.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: