కరోనా మహమ్మారి దేశంలో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు నిదానంగా పెరుగుతూ వచ్చాయి.  ఇక ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ లో జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగి జమాత్ కు హాజరైనవారిలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. గత ఐదు రోజుల నుంచి వీరి వల్ల కరోనా పాజిటివ్ కేసులు దారుణంగా పెరిగాయి.

 

ఇక ఢిల్లీ పర్యటనకు విదేశాల నుంచి కూడా ముస్లిం భక్తులు రావడం, ఇటు మన దేశంలో పలు రాష్ట్రాల నుంచి వారు కూడా పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. అయితే  విదేశాల నుంచి వారితో కలవడం వల్ల, మన దేశంలోని ముస్లింలకు కూడా కరోనా సోకింది. ఇక దీంతో కరోనా వచ్చిన వారి సంఖ్య ఐదు రోజుల్లో బాగా పెరిగింది.

 

అసలు ముందు నుంచి కరోనా కేసులు సంఖ్య ఎలా పెరుగుతూ వచ్చిందనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.... మార్చి 10 నుంచి 20 వరకూ కరోనా పాజిటివ్ కేసులు 50 నుంచి దాదాపు 200 వరకు చేరుకుంది. ఇక  తర్వాత ఐదు రోజుల్లో ఈ కేసులు బాగా పెరిగాయి. మార్చి 25 నాటికి కేసుల సంఖ్య దాదాపు 600 కు చేరింది. ఇక తర్వాత జమాత్ నుంచి తిరిగొచ్చిన వారి వల్ల, మార్చి 31 నాటికి 1400 కేసులు వరకు వచ్చేసాయి.

 

అక్కడ నుంచి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ కోవిడ్-19 కేసులు 1,024 నుంచి 2,069కి చేరుకున్నాయి. ఏప్రిల్ 3 న కూడా పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. అయితే రానున్న మరో వారం రోజుల్లో కూడా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి వచ్చే వారం రోజుల్లో ఎన్ని కరోనా కేసులు వస్తాయో? ఎంతమందిని కరోనా ఎటాక్ చేస్తుందో?  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: