ఆప‌ద స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఆయా రాష్ట్రాల‌కు   రూ 17,287 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది.  కరోనా వైరస్‌పై రాష్ట్రాలు మరింత సమర్థ‌వంతంగా  పోరాటం చేసేందుకు  ఈ నిధుల‌ను వినియోగించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ప్ర‌ధాన‌మంత్రి మోదీ గురువారం సీఎంల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో కూడా ఆర్థిక సాయం ప్ర‌స్తావ‌న తీసుకువచ్చిన నేప‌థ్యంలోనే ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ నిధుల‌తో పాటు మ‌రికొన్ని నిధుల‌ను ఇవ్వాల‌ని కేంద్రం యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. 

 

14 రాష్ట్రాలకు సంబంధించి పదిహేనో ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ లోటు గ్రాంటు రూ. 6195 కోట్లు కూడా కలిపి ఉన్నాయి. ఆర్థిక‌సాయం పొందుతున్న రాష్ట్రాల్లో  ఏపీ, అసోం, హిమచల్‌ ప్రదేశ్‌, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, పంజాబ్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లకు ఆర్థిక శాఖ మంజూరు చేసింది. ఇక కరోనా మహమ్మారిని దీటుగా కట్టడి చేసేందుకు ఎస్‌డీఆర్‌ఎమ్‌ఎఫ్‌ తొలి వాయిదాగా అన్ని రాష్ట్రాలకు రూ 11,092 కోట్లు విడుదల చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

 

 చైనా నుంచి వైద్య ప‌రిక‌రాలు, మెడిసిన్స్‌, మాస్కులు వంటివి కేంద్ర ప్ర‌భుత్వం దిగుమ‌తి చేసుకునేందుకు ఇప్ప‌టికే ఏర్పాట్ల‌ను పూర్తి చేసిన విష‌యం తెలిసిందే.  మరోవైపు  దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2500 దాటగా మరణాల సంఖ్య 62కు చేరింది. ఇప్పటి వరకూ భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 2547కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 163 మంది కోవిడ్ బారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. శుక్రవారం తెలంగాణలోనే అనూహ్యంగా 75 కొత్త కేసులను గుర్తించారు. రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తెలంగాణలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 229కి చేరింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: