కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో ఏపీలో విజృంభిస్తుందో రోజూ చూస్తూనే ఉన్నాం. మొన్నటివరకు 25 లోపే ఉన్న కరోనా పాజిటివ్ కేసులు, గత నాలుగు రోజులు నుంచి ఉహించని విధంగా పెరిగిపోయి, 150 దాటేసి, 200 కు దగ్గరలోకి వెళ్లిపోయాయి. అయితే కరోనా ఏ స్థాయిలో బీభత్సం సృష్టిస్తుందో, అదే స్థాయిలో రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి కరోనా మహమ్మారిని ఎదురుకోవాల్సిన సమయంలో రాజకీయం చేస్తూ, ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు.

 

ఈ విషయంలో ఎవరు తగ్గకుండా విమర్శలు వర్షం కురిపించుకుంటూ కరోనాని కూడా రాజకీయం చేస్తున్నారు. అయితే ఈ కరోనా రాజకీయాలకు గుడివాడ నియోజకవర్గం కూడా అతీతంగా లేదు. ఇక్కడ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు వ్యక్తిగతంగా దూషణలు చేసుకుంటున్నారు. గుడివాడ… మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమన్న విషయం తెలిసిందే.

 

అయితే ఇటీవల కొడాలి నాని, ప్రెస్ మీట్ పెట్టి,   కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా రేషన్ ఎందుకు సప్లై చేయడం లేదని టీడీపీ నేతలు చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలని, చంద్రబాబుపై కాస్త ఘాటు పదజాలంతో మంత్రి విమర్శలు చేసారు. ఇక మంత్రి చేసిన విమర్శలకు టీడీపీ నేతలు కూడా గట్టిగానే రియాక్ట్ అవుతూ వచ్చారు. అటు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కొడాలి నానినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. మంత్రి అనే కనీస గౌరవం లేకుండా మాటల దాడిచేసారు. 

 

ఈ క్రమంలోనే గుడివాడలో టీడీపీ కార్యకర్తలు కూడా నాని టార్గెట్ గా విమర్శలు చేసారు. దీంతో వైసీపీ కార్యకర్తలకు కూడా చిర్రెత్తుకొచ్చి, టీడీపీ కార్యకర్తలని వ్యక్తిగతంగా దూషించారు. అసలు నానినీ విమర్శించే హక్కు టీడీపీ వాళ్లకు లేదంటూ విరుచుకుపడ్డారు. ఇక మళ్ళీ వైసీపీ వాళ్లకు టీడీపీ కార్యకర్తలు ఇచ్చారు.  ఈ విధంగా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య కరోనా రాజకీయం నడుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: