కరోనా వైరస్ కారణంగా భారత్ లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగానే ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అలానే ఓ జంట స్వామిజి ఆశీస్సులు తీసుకోవడం కోసం గుడికి వెళ్లారు. అలా గుడికి వెళ్లిన వారికీ లాక్ డౌన్ ప్రకటనతో తిరిగి ఇంటికి వెళ్లలేకపోయారు. 

 

IHG

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని సమీప ప్రాంతానికి చెందిన బసవరాజా, సావిత్రమ్మ అనే ఓ జంట గత కొద్దికాలంగా భార్యపై అనుమానం పెంచుకొని తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేని సావిత్రమ్మ స్వామిజి ఆశీస్సుల తీసుకుంటే కష్టాలు తీరిపోతాయని తెలిసి కూతురితో సహా భర్తతో కలిసి దొడ్డబళ్లాపుర - ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ రోడ్డులోని దొడ్డేరి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు.

 

IHG

 

అయితే మొదటి రోజు గుడి మూసేయడంతో మరుసటి రోజు ఆ గుడికి మళ్లీ వెళ్లారు. ఆలా వెళ్లిన స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.. అయితే ఆరోజు సాయింత్రమే లాక్ డౌన్ ప్రకటించడంతో రవాణా సౌకర్యాలు లేక గుడిలోనే ఆగిపోయారు. అయితే స్వామిజి వారికీ బస ఏర్పాటు చేశాడు. ఇంకా అప్పటి నుండి ఆలయంలోనే ఉండేవారు.. అయితే ఆలయంలో ప్రశాంతంగా ఉండాల్సిన వారు అక్కడ కూడా ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. 

 

IHG

 

దీంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమెను కన్నకూతురు ముందే అతి దారుణంగా హత్య చేశాడు. కన్నకూతురు కళ్ళముందే తలపై బండరాయితో కొట్టి అతి కిరాతకంగా చంపేశాడు. దీంతో బాలిక భయంతో పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు రావడంతో బసవరాజు అక్కడ నుండి పరారయ్యాడు. అప్పటికే సావిత్రమ్మ మృతి చెందింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: