తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తైంది. కొత్త కేసులు నమోదు కాకుండా మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రంలో 75 కేసులు నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలోనే 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

 

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాలో ఒక్కరోజులో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటన చేశారు. జిల్లాలో 42 మంది కరోనా అనుమానితుల నమూనాలను పరీక్షలకు పంపగా 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. 42 మందిలో ఒకరి నివేదిక ఇంకా అందాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

 

జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైన వారందరికీ వైద్య సదుపాయాలు కల్పించి త్వరగా వాధి బారి నుండి బయటపడేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు జిల్లాలో ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో ఒక్కరోజులో భారీ సంఖ్యలో కేసులు కావడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తూ ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఈరోజు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. సికింద్రాబాద్, షాద్ నగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు మృతి చెందారు. మరోవైపు ఈరోజు కరోనా నుంచి కోలుకుని 15 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: