కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ ఒక రాష్ట్రాధినేతగా తన సత్తా చాటుతున్నారనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదట కరోనా కేసులు నమోదైంది తెలంగాణలోనే.. కరీంనగర్ వచ్చిన ఇండోనేషియా ముస్లింల ద్వారా కరోనా వచ్చిందన్న విషయం తెలుసుకుని కేసీఆర్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

 

 

క్రమంగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కేసీఆర్ అటు మోడీ కంటే ముందుగానే తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించారు. అంతే కాదు.. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. తరచూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ.. ప్రజల్లో ధైర్యం నింపారు. కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరాన్ని కేసీఆర్ ప్రజలకు వివరించడంలో సఫలమయ్యారు. దీనికి స్వతహాగా కేసీఆర్ కు ఉన్న వాగ్దాటి, వాదనా పటిమ కలసివచ్చాయనే చెప్పాలి.

 

 

అంతే కాదు.. కేసీఆర్ కు ఈటల రాజేందర్ రూపంలో ఓ నమ్మకమైన, చిత్తశుద్ధి కలిగిన నేత ఆరోగ్యశాఖ మంత్రి గా ఉండటం చాలా వరకూ కలసి వచ్చింది. ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో కరోనా పై పోరాటంలో పాల్గొంటున్నారు. ఆయన ధైర్యంగా కరోనా వార్డుల్లో తిరుగుతూ రోగుల్లో భరోసా నింపారు. కష్టకాలంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజలు సహకరిస్తారనే విషయాన్ని కేసీఆర్ అవగాహన చేసుకున్నారు.

 

 

అందుకే కరోనా సమయంలో ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడకుండా ఉద్యోగుల జీతాల్లోనూ కోత వేసేందుకు వెనుకాడలేదు. ఒక నాయకుడు కష్ట సమయాల్లో ఎలా ప్రజలతో డీల్ చేయాలో అదే తరహాలో కేసీఆర్ తన సమర్థత చాటుకున్నారనే చెప్పాలి. ప్రజలకు ధైర్యం చెప్పడంలోనూ.. అదే సమయంలో ప్రజల తీరును విమర్శిస్తూ.. నాలుగు మాటలు మాట్లాడటంలోనూ కేసీఆర్ తన పాత్రను క్రియాశీలకంగా పోషించారు. మొత్తానికి కరోనాపై పోరులో కేసీఆర్ మంచి మార్కులే కొట్టేశారు.

 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: