భూమి మీద మనిషి జీవన మనుగడని అత్యంత ప్రమాదకర స్థితిలో కి నెట్టేసింది కరోనా వైరస్. ప్రపంచంలో మరణమృదంగం క్రియేట్ చేసిన ఈ వైరస్ దెబ్బకి అభివృద్ధి చెందిన దేశాలు కూడా బెంబేలెత్తి పోతున్నాయి. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల మందికి ఈ వైరస్ సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా 50 వేలకు పైగానే మనుషులు ఈ వైరస్ వల్ల చనిపోయినట్లు సమాచారం. ఒక్క మనుషులకే కాదు జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతున్నట్లు ఇటీవల తేలింది. హాంగ్ కాంగ్ లో రెండు కుక్కలకి అదేవిధంగాబెల్జియంలో ఒక పిల్లికి కరోనా సోకటం తో ఈ వార్త ప్రపంచం లోనే వైరల్ గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు జంతువుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉందా అని పరిశోధనలు చేపట్టారు.

 

ఈ నేపథ్యంలో పిల్లుల నుండి మరో పిల్లులకు ఈ వైరస్ సోకుతుందని పరిశోధనలో తేలింది. ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు ఓ మూడు పిల్లులకు కరోనా వైరస్ ను ఇంజెక్ట్ చేసి - వాటితో ఆరోగ్యవంతమైన మరో రెండు పిల్లులను కలిపి ఒకే బోనులో ఉంచారు. బయటకు తీసుకొచ్చాక పరీక్షించగా ఓ పిల్లిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో కుక్కలు మరియు పందులు అదేవిధంగా కోళ్లకు ఈ వైరస్ సోకే అవకాశం లేదని అంటున్నారు.

 

అయితే పిల్లుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ వార్తలు రావడంతో ప్రస్తుతం చైనాలో పిల్లి మరియు కుక్కల మాంసము పై నిషేధం విధించారు. దీంతో ఈ విధంగా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఇదెక్కడి కొత్త యాంగిల్ రా బాబు అని జంతు ప్రేమికులు లబోదిబోమంటున్నారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: