దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా ప్రభావం ఏపీలో మొదట్లో చాలా తక్కువగానే ఉండేది. మార్చి 20 నాటికి ఏపీలో నమోదైంది ఒకే ఒక్క పాజిటివ్ కేసు. కానీ ఈ కేసు ఆధారంగా అప్పటికే ప్రకటించి కొంత మేరకు జరిగిన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేయడం ఏపీ సీఎం జగన్‌ కు చిరాకు తెప్పించింది. అసలు రాష్ట్రంలో కరోనా ప్రభావమే లేదు.. ఆ మాత్రం దానికి ఎన్నికలు వాయిదా వేస్తారా అంటూ ఎస్ ఈసీ పై జగన్ భగ్గుమన్నాడు.

 

 

ఆ గొడవలతోనే మొదట్లో కరోనా వ్యాప్తి అరికట్టే ప్రక్రియలో జగన్ అన్యమనస్కంగానే రంగంలోకి దిగారనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే సిట్యుయేషన్ దేశంలో సీరియస్ అవుతుందో ఇక అప్పటి నుంచి జగన్ లైన్‌లోకి వచ్చేశాడు. అసలు రాష్ట్రంలో అడుగు పెట్టిన విదేశీయులు ఎంత మందో లెక్క తేల్చడంలో జగన్ సర్కారు ప్రవేశ పెట్టిన గ్రామ వాలంటీర్లు సమర్థంగా పని చేయడంతో జాతీయ స్థాయిలో జగన్ సర్కారుకు మంచి పేరు వచ్చింది.

 

 

అయితే లాక్‌ డౌన్ సందర్భంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ వాళ్లు ఆంధ్రప్రదేశ్ వస్తారన్న అంశంపై తెలంగాణతో సమన్వయం చేసుకోలేకపోవడం కాస్త ఇబ్బంది పెట్టింది. సొంత రాష్ట్రం వాళ్లను కూడా రాష్ట్రంలోనికి రానీయడం లేదన్న పేరు వచ్చింది. కాకపోతే...కఠినంగా నిబంధనలు అమలు చేసే విషయంలో జగన్ మంచి పేరే సంపాదించారు. అయితే కరోనా సమయంలో జగన్ ప్రజలతో సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేదన్న అసంతృప్తి జనంలో ఉంది. సమీక్షల నిర్వహణ వరకూ ఓకే కానీ.. జగన్ ప్రెస్ మీట్లలో సరిగ్గా భావాన్ని ప్రజలకు చేర్చలేకపోయాడనే చెప్పాలి.

 

 

అదే సమయంలో పక్క రాష్ట్రంలో కేసీఆర్ చెలరేగిపోవడం.. కేసీఆర్‌ తో జగన్‌ను పోల్చుకోవడం వంటి కారణాలతో జగన్ కాస్త వెనుకబడ్డాడు. అయితే టెక్నాలజీని ఉపయోగించి హోం క్వారంటైన్‌లో ఉన్నవారి కదలికలు నియంత్రించడం, ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ల సంఖ్య పెంచడం, రైతుబజార్లను మైదానాలకు తరలించడం, వీలున్న చోట్ల ప్రజల వద్దకే కూరగాయలు తీసుకెళ్లడం వంటి అంశాలతో జగన్ మంచి మార్కులు కొట్టేశారు. ఓవరాల్‌ గా చూస్తే కరోనా ఇష్యూలో జగన్‌కు యావరేజ్‌ మార్కులు పడతాయనే చెప్పాలి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: