ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ను చూస్తేనే బయపడేవిధంగా చేస్తుంది. ఈ కరోనా వైరస్ బారిన ఇప్పటికే 11 లక్షలమంది పడ్డారు.. అందులో 56 వేలమందికిపైగా మృత్యువాత పడ్డారు. ఎందుకు అలా అంటే? ఆ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదు.. అంతే కాకుండా అంటూ వ్యాధి కాబట్టి అత్యంత వేగంగా ఒకరి నుండి ఒకరికి ఈ వైరస్ అంటుకుంటుంది. 

 

ఇకపోతే అలాంటి ఈ కరోనా వైరస్ ను నివారించేందుకు భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఓ వినూత్నమైన టీకాను అభివృద్ధి చేసింది. ఒక్క చుక్క టీకాను ముక్కు ద్వారా వేసుకుంటే పనిచేస్తుంది. ఇప్పటికే ఈ టీకాపై మొదటి, రెండో దశ మానవ ప్రయోగాలు కూడా పూర్తయినట్లు భారత్‌ బయోటెక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

 

అయితే ఈ టీకాను కోరోఫ్లూ అని పిలుస్తాం అని తాము విస్కాన్సిన్‌ మాడిసన్‌ యూనివర్సిటీ, ఫ్లూజెన్‌ అనే వ్యాక్సిన్‌ కంపెనీలతో కలసి అభివృద్ధి చేస్తున్నాం అని ఫ్లూజెన్‌ కంపెనీ ఎం2ఎస్‌ఆర్‌ ఇన్‌ప్లుయెంజా వైరస్‌ ఆధారంగా కోరోఫ్లూ తయారైందని వెల్లడించారు. కాగా ఈ టీకా రోగనిరోధక వ్యవస్థలో మంచి స్పందన కలిగిస్తుంది అని చెప్పారు. 

 

కరోనా వైరస్ నియంత్రణ కోసం భారత్‌ బయోటెక్‌ ఈ టీకాను అభివృద్ధి చేయడం, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం వంటి అన్ని బాధ్యతలు చేపడుతున్నట్టు అలాగే ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు 30 కోట్ల టీకాలను సిద్ధం చేస్తున్నట్టు డాక్టర్‌ రాచెస్‌ ఎల్లా తెలిపారు. ఫ్లూజెన్‌ తయారీ పద్ధతులతో భారత్‌ బయోటెక్‌లో టీకాలు సిద్ధం చేస్తున్నట్టు అయన చెప్పారు. ఏమైతేనేం.. కరోనా వైరస్ కు టీకా రెడీ అయిపోతుంది.. మరి కొద్దీ కాలంలో దీనికి మందు ఉంటుంది.. ప్రజలు కరోనా బారి నుండి బయటపడతారు.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: