అరవింద్ కేజ్రీవాల్.. దేశంలోని అతి చిన్న రాష్ట్రాల్లోని ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంతే కాదు.. తన రాష్ట్రంపై తనకు పూర్తి అధికారాలు లేని ముఖ్యమంత్రి. అయితే ఆయన పాలించే రాష్ట్రం దేశానికే గుండెకాయ. అందుకే ఆయనపై అంత ఫోకస్. మరి కరోనాపై పోరాటం విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎంత వరకూ పోరాడారు. ఎన్ని మార్కులు సంపాదించారు..ఈ అంశాన్ని పరిశీలిద్దాం.

 

 

కరోనాపై పోరాటంలో అరవింద్ కేజ్రీవాల్ తగిన చొరవ చూపించారు. లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో ఆయన పేదల కోసం అద్భుతమైన ప్యాకేజీ ప్రకటించారు. అదే సమయంలో వలస కూలీల విషయంలో ఆయన ప్రేమ చూపించారు. వారి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇక దేశమంతా కలకలం సృష్టించిన మర్కజ్ విషయంలోనూ కేజ్రీవాల్ కఠిన వైఖరి అవలంభించారు. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వేల మంది ఒక చోట చేరడాన్ని నిర్లక్ష్యంగా వర్ణించిన కేజ్రీవాల్ వారిపై కేసులు పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

 

 

కాకపోతే ఆయనకు పోలీసు అధికారాలు లేనందువల్ల ఈ విషయంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేఖ రాయడం మినహా ఆయన చేయగలిగింది తక్కువే. అయినా తన వంతు ప్రయత్నం చేశారనే చెప్పాలి. ఇక కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యుల కోసం కేజ్రీవాల్ కోటి రూపాయల బీమా నిర్ణయం ప్రకటించడం దేశమంతా మెచ్చుకుంది.

 

 

 

కరోనా మహమ్మారిపై పోరాటంలో ఒకవేళ ఎవరైనా సిబ్బంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. కొవిడ్‌-19పై పోరులో వారి సేవలు సైనికుల కంటే తక్కువేమీ కాదని కొనియాడారు. ఇలాంటి మానవీయ చర్యల ద్వారా అరవింద్ కేజ్రీవాల్‌ అందరి మనసులు గెలుచుకున్నారు. అందుకే కరోనా పై పోరాటంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కు ఫస్ట్ క్లాస్‌ మార్కులు పడతాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: