దేశవ్యాప్తంగా కరోనా కేసులు 2 వేలు దాటాయి. అయితే ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాతంలో జరిగిన తబ్లీగ్ జమాత్‌ కారణంగా కరోనా దేశమంతా వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కోణంలో లెక్కలు తీస్తే కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. తబ్లీగ్ జమాత్ కారణంగా 14 రాష్ట్రాల్లో కరోనా వ్యాపించిందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి.

 

 

కేవలం తబ్లీగ్ జమాత్ కారణంగానే దేశ వ్యాప్తంగా 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం ఒక్కరోజే ఈ జమాత్ కారణంగా 336 కొత్త కేసులు నమోదయ్యాయట. మొత్తం దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 వేలు దాటింది. ఇప్పటి వరకూ 80 మందికి పైగా కరోనాతో మరణించారు.

 

 

తమిళనాడులో ఈ తబ్లీగ్ జమాత్ ప్రభావం చాలా దారుణంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ మొత్తం 411 నమోదయ్యాయి. అయితే ఈ పాజిటివ్ కేసులలో 364 కేసులు నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వచ్చిన వారివే కావడం విశేషం. తాజాగా కొత్తగా నమోదైన 102 పాజిటివ్ కేసులలో 100 పాజిటివ్ కేసులు నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారివేనని తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు.

 

 

దేశంలో ఇంతగా కరోనా వ్యాపించడానికి కారణంగా మారిన తబ్లీగ్ జమాత్ పై చర్యలకు కేంద్రం ఉపక్రమిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన 960 మంది విదేశీ తబ్లీగ్ జమాత్ కార్యకర్తలపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం ప్రకటించింది. కోవిడ్ కు సంబంధించిన ఆరోగ్య ప్రోటోకాల్ పూర్తి అయిన తర్వాతే వారి దేశానికి పంపే ఏర్పాటు చేస్తామని హోం శాఖ తెలిపింది.

 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: