మన రాష్ట్రంలో ఏప్రిల్ 7 తర్వాత కరోనా వైరస్ ఉండే అవకాశం లేదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చాలా ధీమగా మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉన్నా సరే తెలంగాణాలో మాత్రం ఉండే అవకాశం లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసి వేశామని కరోనా రావడానికి అసలు ఏ మార్గం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. 

 


 
కాని కరోనా వైరస్ మాత్రం తెలంగాణాలో రోజు రోజుకి పెరుగుతుంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 75 బయటపడ్డాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ అక్కడి ప్రభుత్వం చాలా వరకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తుంది. అయినా సరే ఇది మాత్రం కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. కేసీఆర్ ఇప్పుడు ఎం చేస్తారు అనేది తెలంగాణా మొత్తం ఆసక్తిగా చూస్తుంది. 

 

 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. నిన్న ఒక్క రోజే భారీగా పెరిగిన నేపధ్యంలో లాక్ డౌన్ ని తెలంగాణాలో ఎత్తేసే అవకాశాలు లేవని అంటున్నారు. అలాగే రైలు సర్వీసులను కూడా తిప్పే ఆలోచనలో కేంద్రం ఉందనే ప్రచారం జరుగుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పటికే తెలంగాణాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ ఆంక్షలు ఇంకా పెంచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: