ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో పైకి కనపడని ఒత్తిడి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయన ఇప్పుడు కరోన కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో ఊహించని విధంగా పెరగడం, చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరించడం తో జగన్ కి ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా, 

 

రాజకీయ వర్గాలతో పాటుగా ప్రభుత్వ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయన భవిష్యత్తుని ఊహించే ఆరు నెలల పాటు వైద్య సిబ్బంది మొత్తాన్ని ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చారని అంటున్నారు. కరోనా వైరస్ కేసులు తీవ్రంగా పెరగడంతో జగన్ ఒత్తిడిలో ఆ నిర్ణయం తీసుకున్నారనే వాళ్ళు ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే రాష్ట్రంలో వైద్య సిబ్బందికి ఎక్కువగా పరికరాల కొరత ఉందనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. 

 

ఆ కొరత తీరకపోతే మాత్రం రాష్ట్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రధాని మోడీ కబుర్లు చెప్పడమే గాని రాష్ట్రానికి ఇచ్చేది ఏ ఒక్కటి లేదని అంటున్నారు. రాష్ట్రానికి ఆర్ధికంగా ఇబ్బందులు ఉండటం కూడా జగన్ లో తీవ్ర ఒత్తిడికి కారణమనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇప్పుడు కేంద్రం సాయం కోసం జగన్ ఎదురు చూస్తున్నారని, ఆదాయం లేకపోవడం తో ఆయనకు కనపడని ఒత్తిడి ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: