అగ్ర రాజ్యం అమెరికా ఇప్పుడు కరోనా ప్రళయాన్ని ఎదుర్కోలేక ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతుంది. కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అగ్ర రాజ్యానికి అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో ఉండటం తో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ మీడియా కూడా అంటుంది. ట్రంప్ ఇప్పుడు అమెరికాను కాపాడే స్థితిలో లేరు అంటుంది. 

 

దానికి కారణాలను కుద ఎక్కువగానే చెప్తుంది. అగ్ర రాజ్యంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని, ఈ సంఖ్య రాబోయే నెల రోజుల్లో పది లక్షల వరకు చేరుతుందని అక్కడ దాదాపు లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ మరణాల సంఖ్య భారీగా పెరగడం ఖాయమని అంటున్నారు. ఇక ఇప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. 

 

కరోనా వ్యాపించే రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత ఘోరంగా పడిపోతుందని అందుకే కరోనా ఆ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం అనేది నిపుణుల మాట. కరోనా కట్టడి విషయంలో ట్రంప్ సర్కార్ దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలం అవుతుంది అనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చర్యలు అన్నీ కూడా అమెరికాను కరోనా వైరస్ బారిన పూర్తిగా పడే విధంగా చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు అమెరికా బయటకు రాలేని స్థితిలో ఉందీ అనేది అందరి మాట.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: