కరోనా విపత్తు గురించి అందరూ టెన్షన్ లో ఉంటున్నారు. ఈ వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. అందుకే ఇంతగా ఈ మహమ్మారి గురించి ప్రజల్లో ఆందోళన నెలకొని ఉంది. దీంతో ప్రజల భయాందోళన పోగొట్టేందుకు ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తూ, ప్రజలను ఒకవైపు చైతన్యవంతం చేస్తుండగా మరో వైపు మాత్రం  కొంతమంది ఆకతాయిలకు ఇది మహా సరదాగా కనిపిస్తోంది. అందుకే కరోనా గురించి  ప్రజలను భయపెట్టే విధంగా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజల్లో మరింత ఆందోళన పెంచుతున్నారు. ఈ కరోనా వైరస్ కు సంబంధించిన ప్రతి వార్త ప్రజల్లో ఆసక్తి కలిగిస్తుండడంతో ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజలను మరింత భయపెట్టేస్తున్నారు. అయితే దీనిపైన పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. 

 

IHG


ఇకపై ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే, ఆషామాషీగా ఉండదని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలో ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ విషయంలో ప్రజల కోసం పోలీసులు చాలా కష్టపడుతున్నారు అని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని చెప్పిన ఆయన, కొంతమంది ఆకతాయిలు మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ఇటువంటి పరిస్థితి వస్తే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలను ఓ సందర్భంలో ప్రస్తావించారు.

 

IHG


 తప్పుడు ప్రచారాలు చేసినవారికి శిక్షలు  అంటే ఎలా ఉంటాయన్నది అమలుచేసి చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఏపీలోనూ తప్పుడు ప్రచారాలు తీరుపై డీజీపీ గట్టిగానే హెచ్చరికలు చేశారు. కరోనా కేసులు, మరణాలు, కంటోన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ లు, మతపరమైన విషయాలు, క్వారంటైన్ కేంద్రాలు, ఇలా ఏ విషయం పైన అయినా, ఇష్టమొచ్చినట్టుగా ప్రచారాలు చేస్తే ఊరికే వదిలిపెట్టమని డిజిపి గట్టిగా హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: