లాక్ డౌన్ ని కొనసాగించాలా వద్దా అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎటూ కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ ని ముందు 21 రోజులు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాని ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇప్పుడు లాక్ డౌన్ ని గనుక ఏ మాత్రం సడలించినా సరే పరిస్థితులు చాలా వేగంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా మంది మాట. 

 

కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో కేంద్రం ఇప్పుడు చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నా సరే లాక్ డౌన్ ని గనుక సడలిస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. లాక్ డౌన్ విషయంలో కేంద్రం కూడా ఇప్పుడు చాలా తర్జన భర్జన పడుతుంది. ముందు రంగాల వారిగా సడలించాలి అని చూసినా సరే... రాష్ట్రాల వారీగా అని కేంద్రం మళ్ళీ ఆలోచనలో పడింది. 

 

ముందు ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని సడలించాలి అని కేంద్రం భావిస్తుంది. కరోనా ప్రభావం కొన్ని జిల్లాల్లో అసలు లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అసలు కరోనా ప్రభావం లేదు. అక్కడ ఎవరికి కూడా కరోనా వైరస్ సోకలేదు. ఓడిస్సాలో చాలా జిల్లాలకు కరోనా పరిచయం అవ్వలేదు. ఉత్తరప్రదేశ్ లో దాదాపు 20 జిల్లాలకు కరోనా తెలియదు. బీహార్ లో కూడా ఇలాగే ఉంది. అందుకే ఇప్పుడు జిల్లాల వారీగా సడలించాలి అని చూస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: