దేశంలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి ఎంత చేయాలో అంత చేస్తున్నారు.క‌రోనాను ఎదుర్కొవ‌డానికి ముందుగా కావాల్సింది ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌, చైత‌న్యం ఈరెండు పెంపొందించ‌డానికి ఆయ‌న కృషి చేస్తున్నారు. జ‌న‌తా క‌ర్ఫ్యూ ఇందులో భాగ‌మే..నేరుగా లాక్‌డౌన్‌కు వెళ్ల‌కుండా జ‌న‌తా క‌ర్ఫ్యూ పేరుతో క‌రోనాపై జ‌నాలంద‌రిలోకి సంక‌ల్ప‌బ‌లం నినాదాన్ని బ‌లాన్ని పెంపొందించారు. క్లాప్స్ కొట్టాల‌ని పిలుపునివ్వ‌డం కూడా క‌రోనా క‌ట్ట‌డికి మేమంతా మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాం అనే సందేశాన్ని జ‌నాల‌చేత చెప్పించ‌డానికి వ్యూహాత్మ‌కంగా అమ‌లు చేసిన ప్ర‌క్రియ‌.

ఇక ప్ర‌ధాన‌మంత్రి మోదీ తాజాగా వ‌చ్చే ఆదివారం రాత్రి 9గంట‌లకు 9నిముషాల పాటు కొవ్వొత్తులు లేదా దీపాలు, టార్చిలైట్లు, మొబైల్ ష్లాష్‌లైట్లు  వెలిగించి సంఘీభావం తెల‌పాల‌ని పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ సమయంలో... కరెంటు లైట్లు ఆర్పివేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుంటే... మరికొన్ని వర్గాలు మండిపడుతున్నాయి. ప్రధాని మోదీ మరోసారి మమ్మల్ని ఫూల్స్ చెయ్యవద్దంటూ కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి స‌రైన చ‌ర్య‌లు తీసుకోకుండా చ‌ప్ప‌ట్లు కొట్టండి..కొవ్వొత్తుల‌ను వెలిగించండి అంటూ మ‌మ్మ‌ల్ని ఫూల్స్ చేయొద్దు అంటూ  మండిప‌డుతున్నారు. 


ఇప్పటికే జనతా కర్ఫ్యూ పేరుతో ప్రధాని మోదీ ఓసారి తమను ఫూల్స్ చేశారనీ... ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి #ModijiDontMakeUsFoolAgain అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా భార‌త్‌లో  ఇప్ప‌టి వ‌ర‌కు 2547 పాజిటివ్ కేసులున్నాయి. క‌రోనా బారిన ప‌డి 62 మంది మ‌ర‌ణించారు. తెలంగాణలో 158 పాజిటివ్ కేసులు ఉండగా... మరణాల సంఖ్య 7గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 132 పాజిటివ్ కేసులు ఉండగా... ఓ మరణం సంభవించింది. ఐతే... ఈ లెక్కలు ఆలస్యంగా వస్తున్నాయనీ, అసలు కేసులు ఇంకా ఎక్కువేననే వాదన ఉంద‌నే అభిప్రాయం జ‌నాల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: