భారత్ లో  కరోనా వైరస్ కోరలు చాస్తూ  కుదిపేస్తుంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా... ఎన్ని కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చిన... ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేసిన... కరోనా  వైరస్ విలయతాండవం మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు క్రమక్రమంగా కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది కానీ ఎక్కడైనా తగ్గుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనిపించని శత్రువైన కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు... ప్రపంచ మహమ్మారిపై విజయం సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు అయిప్పటికీ... ఫలితం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా... ప్రజలు నిర్లక్ష్యం కారణంగా రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. 

 

 

 

 ఓవైపు ప్రజలందరూ ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా  వైరస్ పై  కనీస అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వయస్సుతో సంబంధం లేకుండా... ధనిక పేద అనే తేడా లేకుండా అందరినీ భయాందోళనకు గురి చేస్తూ వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువగా కరోనా  వైరస్ బారిన పడుతున్న వారు వృద్ధులే ఉండటం గమనార్హం. 65 ఏళ్లు దాటిన వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి... వృద్ధులు ఎక్కువగా ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. ఇక కరోనా  వైరస్ బారిన పడిన వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. 

 

 

 కానీ ఇక్కడ  వృద్ధ దంపతులు మాత్రం వృద్ధ వయస్సులోనూ మృత్యువుతో పోరాడి మహమ్మారిని జయించారు.  కరోనా  వైరస్ బారినపడి చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకుని ప్రస్తుతం అందరిలో  ధైర్యం నింపుతున్నారు ఈ వృద్ధ దంపతులు. తొంభై ఏళ్ల వయసులోనూ కరోనా  వైరస్ ను  జయించారు. కేరళ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన తామస్ అబ్రహం (93) భార్య మరియమ్మ  (88) కు... ఇటలీ నుంచి వచ్చిన కొడుకు కోడలు ద్వారా... ఈ వృద్ధ దంపతులకు కరోనా  వైరస్ సోకింది. దీంతో వెంటనే వీరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. కాగా వీరు శుక్రవారం నాటికి పూర్తిగా కరోనా  వైరస్ నుంచి కోలుకోవడం... మరోసారి పరీక్షలు నిర్వహించిన నెగిటివ్ అని రావడంతో వీరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కాగా ఇప్పటి వరకు ఇండియాలో కరోనా  సోకి కోలుకున్న వృద్ధుల్లో ఎక్కువ వయస్కుడు అబ్రహామే.

మరింత సమాచారం తెలుసుకోండి: