మనుషులు గొర్రెల మంద లాంటి వారని అప్పుడప్పుడు ఖచ్చితంగా నిరూపించుకుంటారు.. అదెలా అంటే ఒక వ్యక్తి అలా రోడ్డుమీద నుండి వెళ్లుతూ వెళ్లుతూ సడెన్‌గా ఆగి ఆకాశం వైపు చూస్తుంటే అతన్ని చూసిన మిగతావారు కూడా అలాగే నిలబడి ఆకాశం వైపు చూస్తారు.. అక్కడ ఏం కనిపించకున్నా సరే ఇలా ఒకరివెనక ఒకరు జనం వరస కడతారు.. ఈ ఒక్క విషయంలోనే కాదు.. దాదాపుగా అన్నివిషయాల్లో ఇలాగే ప్రవర్తిస్తుంటారు..

 

 

ఇకపోతే కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్ ప్రకటిస్తున్నారు అని తెలియగానే అప్పటి వరకు వారం పదిరోజులకు సరిపడ సరుకులు తెచ్చుకునే వారి నుండి, నెలకు అవసరానికి మించి సరకులు తీసుకునే వారి వరకు నిత్యావసర సరకులను ఫుల్‌స్టాక్  పెట్టుకున్నారు.. సరే పేదవాడు అంటే అతని దగ్గర నిత్యం డబ్బులు ఉండవు భార్య బిడ్దలను పోషించుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి.. అందులో అధిక ధరలకు వెచ్చించి సరకులు కనుగోలు చేయలేడు.. కానీ ధనవంతులు కూడా మూడింతల వరకు సరకులు కొనే సరికి, ప్రస్తుతం నిత్యావసర సరకుల కొరత ఏర్పడిందట..

 

 

అసలే నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచే కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌లకు సరుకు రవాణా క్లిష్టతరంగా మారింది. డిమాండ్‌ మేరకు నిత్యావసరాలు సరఫరా లేకపోవడం, గోదాముల్లో సరుకుల రవాణాకు, ప్యాకేజింగ్‌కు సిబ్బంది కొరత ఉండటంతో నిల్వలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని చాలా సూపర్‌మార్కెట్‌లో ఖాళీ ర్యాకులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రోజువారీ అవసరాల్లో ప్రధానంగా వాడే ఉప్మా, ఇడ్లీ రవ్వలతో పాటు, టీ, కాఫీ పొడి, కారం, చక్కెర, పసుపు, నూనెలు, గోధుమపిండి వంటి సరుకులతో పాటు డిటర్జెంట్లు, హ్యాండ్‌వాష్‌లు, న్యాప్కిన్లు, డైపర్లతో పాటుగా మరికొన్ని మనిషి బ్రతకడానికి అవసరమైన సరకుల సరఫరా తగ్గడంతో వీటికి కొరత ఏర్పడుతోంది.

 

 

దీనికి కారణం వినియోగదారులు పెద్ద ఎత్తున అవసరాలకు మించి కొనుగోళ్లు చేశారట. సాధారణంగా వారానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసే అలవాటుకు భిన్నంగా కొందరు ముందుగానే పెద్దమొత్తంలో సరుకులను కొనుగోళ్లు చేశారు. దీంతో అవి నిండుకున్నాయని కిరాణా వర్తకులు పేర్కొంటున్నారు.. ఏది ఏమైనా మనుషులకు ఉన్న స్వార్ధం ముందు ఏది పనికి రాదు.. అందులో ఉన్నవాడి స్వార్ధం ముందు పేదవారు ఎప్పటికి పేదవాడి గానే ఉంటున్నారు అని కొందరు అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: