ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న  ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ పేరెత్తితే చాలు ప్రపంచ దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుపోతున్న ఈ మహమ్మారి వైరస్ తో ప్రాణభయం ఉన్న ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు ప్రపంచ దేశాల ప్రజలు. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్... అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా వదలడం లేదు. ఈ ప్రాణాంతకమైన మహమ్మారికి సరైన విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ వైరస్ కి ఎక్కడ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. 

 

 

 దీంతో ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు నివారణ ఒక్కటే మార్గం అయింది. దీంతో ప్రపంచ దేశాలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా ఇప్పటికీ ప్రపంచదేశాలను కబళిస్తున్న  మహమ్మారి వైరస్ పై పోరాటం చేస్తూ విజయం సాధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు  ఎన్నో కఠిన నిబంధనలు అమల్లోకి తీస్తున్నాయి. ఇప్పటికే చాలా మటుకు దేశాలు లాక్ డౌన్ లో కి వెళ్లి పోయాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ వ్యాప్తి ఒక ఎత్తయితే అమెరికా స్పెయిన్ ఇటలీ  లాంటి దేశాల్లో కరోనా వ్యాప్తి ఒకెత్తు అన్న  విషయం తెలిసిందే. మిగతా దేశాల్లో వేలల్లో కరోనా  వైరస్ బాధితులు ఉంటే ఈ మూడు దేశాల్లో మాత్రం లక్షల్లో కరోనా వైరస్ బాధితులు ఉన్నారు. ఇక ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృతి చెందినవారు కూడా పెరుగుతున్నారు  . 

 

 

 అమెరికాలో రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అమెరికా దేశం పై కరోనా వైరస్ పై పోరాటం  చేస్తూ విరుచుకుపడుతూ విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు వరకు అమెరికా లో ఏడు వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. ఒక్క న్యూయార్క్ నగరంలోని 1500 మంది చనిపోయారు. కరోనా  వైరస్ పై పోరాటం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అమెరికా కరోనా  వైరస్ ద్వారా మృతి చెందిన వారిని ఖననం  చేయడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు మృతుల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో స్మశానవాటిక వద్ద రద్దీ పెరిగింది. ఇక ఒక్కసారిగా డిమాండు పెరగడంతో  స్మశాన వాటిక నిర్వాహకులు కూడా చేతులెత్తేస్తున్నారు. మృతదేహాలను ఎక్కువగా ఆస్పత్రిలోనే ఉంచాలని బంధువులు కుటుంబ సభ్యులను కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: