ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటూ.. ఇంకెంతో మంది మృత్యువుతో పోరాడే లా చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తూ ప్రాణభయంతో బతికేలా చేస్తోంది ప్రపంచ మహమ్మారి కరోనా  వైరస్. రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ పై ప్రపంచం మొత్తం అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఈ వైరస్ పై విజయం సాధించేందుకు ప్రపంచ దేశాలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయినప్పటికీ ఈ వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు రోజురోజుకు ఈ వైరస్ పెరిగిపోతూనే ఉంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. 

 

 

 ఇక వైరస్ ప్రభావం భారత్ లో  కూడా రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజురోజుకు భారత ప్రజల్లో ప్రాణభయం పాతుకు పోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ నిర్బంధంలోకి వెళ్లి పోతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కరోనా కట్టడి మాత్రం సాధ్యం కావడం లేదు. రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. అయితే ఈ వైరస్ కు  వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు సరైన ఫలితాలు రాలేదు. 

 

 

 ఇదిలా ఉంటే తాజాగా భారత ప్రజలందరికీ ఒక తీపి కబురు అందింది. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కు  వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ సైంటిస్టులు, టీకా  కంపెనీ అయినా ఫ్లూజెన్  కూడా ఇందులో పాలు పంచుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు 30 కోట్ల డోసులను రెడీ చేస్తున్నాం అని... ఇప్పటికే దీనిపై కూడా జరుగుతున్నాయి అని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: