ఇన్నాళ్లూ ప్రపంచం మొత్తం డబ్బు డబ్బు అంటూ పరుగులు పెట్టింది.. కానీ పరిస్దితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా.. ఇప్పుడు తిరగబడింది.. ప్రస్తుతం అందరు ప్రాణాలు కాపాడుకోవడానికి అలుపెరుగని యుద్ధం చేస్తున్నారు.. ఉన్న వాడు లేని వాడు అనే తేడా లేకుండా అందరిది ఒకటే ఆలోచన.. ఈ కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని రక్షించు దేవుడా అని ప్రార్ధిస్తున్నారు.. ఎన్ని కోట్ల డబ్బుకూడా ఈ సమయంలో కళ్లముందు కదలాడటం లేదు.. కేవలం కరోనా రాకుండా బయటపడితే చాలు అని అనుకుంటున్నారు.. ఇకపోతే కూటికి లేని వాడిని అయినా.. కోటీశ్వరున్ని అయినా.. నీకు డబ్బు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా అంటే మొదట ప్రాణానికే విలువ ఇస్తాడు.. ఈ ప్రాణమే పోతే లక్షల కోట్లు ఏం చేసుకుంటాడు..

 

 

ఇక ప్రాణం మీదికి వచ్చినప్పుడు 80 సంవత్సరాల వృద్ధుడు కూడా ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగుండునని ఆలోచిస్తాడు.. కావాలని ప్రాణ త్యాగానికి సిద్దపడరు.. కాని కరోనా విజృంభిస్తున్న సమయంలో కొందరు వృద్ధులు తాము బ్రతికి ఉండి సాధించేది ఏం ఉండదు.. తమకు అందించే వైద్య సదుపాయాలు యువతకు అందిస్తే కనీసం వారైనా బ్రతుకుతారని ప్రాణ త్యాగానికి సిద్దపడ్డారు.. నిజంగా పోయిన ప్రాణం మళ్లీ తిరిగిరాదని తెలిసిన.. ఆశ అనేది లేకుండా వీరు తీసుకున్న నిర్ణయం.. స్వార్ధంతో బ్రతుకుతున్న ఎందరికో చెంపపెట్టులాంటిది.. ఇక వారి వివరాలు తెలుసుకుంటే.. 90 ఏళ్ల సుజాన్ హోయ్లెర్ట్స్ అనే బామ్మగారు బెల్జియంలో ఉంటారు.. ఈవిడ మార్చి 20 నుంచి కోవిడ్-19 చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో వైద్యులు కృత్రిమ శ్వాస అందించి ప్రాణం కాపాడేందుకు సిద్ధమయ్యారు. అయితే, సుజాన్ ఇందుకు తిరస్కరించారు.

 

 

తాను జీవితంలో అన్నీ చూసేశానని, ఈ వెంటిలేటర్లను పిల్లలు, యువత కోసం ఉపయోగించండని తెలిపారు. చివరికి ఎటువంటి కృత్రిమ శ్వాస తీసుకోకుండానే. కన్ను మూసారు.. ఇక ఇటలీ పరిస్దితి అందరికి తెలిసిందే.. ఇక్కడ కూడా డాన్ గియుసేప్ బెరార్డెల్లి అనే 72 ఏళ్ల మత బోధకుడు గత నెల కోవిడ్-19తో పోరాడుతూ వెంటిలేటర్‌ను తిరస్కరించారు. దీంతో వైద్యులు ఆ వెంటిలేటర్‌ను ఓ చిన్నారికి పెట్టారు. ఎట్టకేలకు ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. కానీ, ఈయన పరలోకానికి చేరుకున్నారు..

 

 

ఇకపోతే ఆయన భౌతికకాయాన్ని శ్మశానానికి తరలిస్తున్న సమయంలో ప్రజలంతా బాల్కానీలోకి వచ్చి నివాళులు అర్పించడం గమనార్హం. ఇలా అక్కడక్కడ జరుగుతున్న వెలుగులోకి రావడం లేదు.. ఒకవేళ కరోనా ఇండియాలో జడలు విప్పితే ఇక్కడి ప్రజల పరిస్దితి కూడా ఇలాగే మారుతుంది.. ఇలాంటి వారి త్యాగం వృధా అవుతుంది.. అందుకే కరోనా వ్యాపించకుండా జాగ్రత్తపడండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: