శుక్రవారం రోజు అనగా ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం భారత ప్రధాని నరేంద్ర మోడీ 40 మంది ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అయితే ఇందులో పి.వి.సింధు సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, మేరీ కోమ్ లాంటి ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. లాక్ డౌన్ అనంతరం ఎటువంటి చర్యలను చేపట్టాలి అని అడిగేందుకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాన మోడీ. ఈ సందర్భంలోనే సచిన్ టెండుల్కర్ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియపరిచారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా కూడా కొన్ని బాధ్యతాయుత చర్యలను అందరూ చేపట్టడం ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ తో సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు.


ఆయన మాట్లాడుతూ... 'కరోనా మహమ్మారి నుండి మన పెద్దలు సురక్షితంగా ఉండాలంటే... మనమందరం తగిన కరోనా జాగ్రత్తలు పాటించాలి. లాక్ డౌన్ ఎత్తేసారు కదా అని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారందరూ మృత్యువాత పడతారు. 21 రోజులపాటు కరోనా పై ఇప్పుడు చేస్తున్న లాక్ డౌన్ యుద్ధ ఫలితం త్వరలోనే రానుంది. ఆ మంచి ఫలితాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలంటే... మనమందరం కరచాలనం బదులు నమస్కారం చేయాలి. గుంపులు గుంపులుగా తిరగకూడదు. భౌతిక దూరాన్ని కూడా తూచా తప్పకుండా పాటించాలి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ లాక్ డౌన్ కేవలం పెద్దల ప్రాణ రక్షణ కై ప్రకటించారు. ఆయన పెద్దల గురించి ఆలోచించిన మనసు నాకు బాగా నచ్చింది. క్రికెట్ మ్యాచ్ లో ఆటగాళ్లందరూ ఒక జట్టుగా ఐక్యమత్యంగా ఉంటూ అపోజిషన్ టీంపై ఎలా గెలుస్తారో... మన భారత దేశ ప్రజలు కూడా ఒక జట్టుగా ఉంటూ కరోనా పై జయించాలి. మన పెద్దలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అలాగే పెద్దలు చెప్తున్న అనుభవాలను మనమందరం తెలుసుకోవాలి', అని అన్నారు.


సచిన్ టెండూల్కర్ కరోనా పై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి ఆర్థిక సహాయంగా రూ.50 లక్షలను విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: