దేశంలో కరోనా పై యుద్దం కొనసాగుతుంది.  కరోనా ని అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ మాయదారి కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో  ఏపిలో ఇప్పటికీ 164 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.   తాజాగా తీరుపతికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటీవ్ గా తెలినట్లు చెబుతున్నారు.  తిరుపతిలోని యశోద నగర్‌కు చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

 

రైలు ప్రయాణంలో కరోనా సోకినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఇటీవల ఆమె రైలు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత అస్వస్థతకు లోనైంది. దాంతో ఆమెను మెడికల్ చెకప్ చేయించగా కరోనా పాజిటీవ్ అని తెలిందని అంటున్నారు.  దాంతో చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరుకుంది.   తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడిని కూడా డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు.

 

అతడు కూడా యూకే నుంచి వచ్చాడని, కోవిడ్ లక్షణాలతో గత నెల 20న కాకినాడ ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. అతడికి కూడా మూడుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్టులు రావడంతో నిన్న డిశ్చార్జ్ చేసినట్టు వివరించారు. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో రెండు, విశాఖపట్టణంలో ఒక కేసు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 164కు పెరిగింది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: