ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్ని ప్రపంచ మహమ్మారి కరోనా  వైరస్ పేరెత్తితే చాలు భయాందోళనలకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కనిపించని శత్రువు  కరోనా వైరస్ తో పోరాటం చేస్తోంది. అయితే ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు ఎంతోమందిని  మృత్యువుతో పోరాడేలా  చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ మహమ్మారి వైరస్ చైనాలోని వుహాన్  నగరంలో వెలుగులోకి వచ్చింది. అక్కడ మరణ మృదంగం మోగించిన మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా చైనా దేశంలో ఈ వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. 

 

 

 ప్రస్తుతం ప్రపంచ దేశాల కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. చాలా మటుకు పేషెంట్లు కోలుకుంటున్నారు. ఎంతగానో అభివృద్ధి చెందిన ఇటలీ స్పెయిన్ అమెరికా దేశాలతో పోలిస్తే చైనా దేశం వైరస్ ను  బలంగా ఆపగలిగినది  అంటున్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు. అయితే ఒక్కసారిగా చైనా దేశంలో వైరస్ ప్రభావం తగ్గడంతో ప్రపంచం చూపు  మొత్తం చైనా పై పడింది. కాగా తాజాగా ఈ మహమ్మారి బారిన పడిన వారికీ  ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనేదానిపై చైనా డాక్టర్లు కొత్త విషయాన్ని బయటకు చెప్పారు. ఆంటీ బాడీస్ అనే విధానం ద్వారా అక్కడి కరోనా  పేషెంట్లకు చికిత్స అందిస్తున్నట్లు  డాక్టర్లు వెల్లడించారు. 

 

 

 వాస్తవానికి ఆంటీబాడీస్ అనేది పాత విధానమే. కరోనా  వైరస్ మనిషి శరీరంలోకి వెళ్లిన తర్వాత ఓ రక్త కణాన్ని  ఎంచుకుని అక్కడ నివాసము ఏర్పాటు చేసుకుని సంతానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఆ రక్త కణం కనుక వైరస్ కుదరకపోతే అది మనిషి శరీరంలోకి వెళ్లిన అక్కడ చచ్చిపోతుంది. ప్రస్తుతం చైనా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఆంటీ బాడీస్ అనే విధానం ద్వారా ఓ వైరస్  శరీరంలోకి ప్రవేశ పెట్టి కరోనా  వైరస్ కు   రక్త కణాలు దొరక కుండా చేయటంతో పాటు..కరోనా వైరస్ తో పోరాడతాయి . మొత్తం 20 రకాల వైరస్ లను  కనిపెట్టిన చైనా డాక్టర్లు... వీటిలో నాలుగు రకాల వైరస్ లు  కరోనాతో  అద్భుతంగా పోరాడ గలుగుతున్నాయని  ఆయన తెలిపారు. ఆంటీబాడీస్ అనేది ఒక రకమైన వైరస్ అయినప్పటికీ అది శరీరానికి ఎలాంటి హానీ చేయదు. అయితే ఈ విధానం ద్వారానే ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలను కాపాడ కలిగింది చైనా ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: