కరోనా నేపధ్యంలో చాలా చోట్ల వినిపిస్తున్న పదం ఆకలి.. ఈ ఆకలికి తారతమ్యం లేదు.. దేశంతో సంబంధం లేదు, పరిస్దితులను ఏమాత్రం చూడదు..  దానికి సమయం ఆసన్నం అయ్యిందా కడుపును మెలిపెడుతుంది.. ప్రతివారిని పట్టుకుని పీడిస్తుంది.. ప్రస్తుత పరిస్దితుల్లో ఇటలీలో నెలకొన్న దుస్దితి ఇదే.. ఒక ఇటలీ అనే కాదు.. మన భారతదేశంలో కూడా చాలా చోట్ల ఇదే పరిస్దితులు నెలకొన్నాయి.. మన ప్రభుత్వాలు పేదల కోసం అనేక రకాలుగా ఆహారపదార్ధాలు, నిత్యావసరాలు అందిస్తుంటే.. కొందరు రేషన్ డీలర్లు మాత్రం పందికొక్కుల్లా మారి ఆ సరకుల్లో కోతలు పెడుతూ అక్రమాలకు తెగబడుతున్నారు.. ఈ సమయంలో మానవత్వాన్ని పూర్తిగా చంపేస్తున్నారు..

 

 

పేదలకు అందవలసిన వాటిని మింగేసి ఏం సుఖపడతారో అర్ధం కాదు.. ఇకపోతే ఇటలీ అంతగా నష్టపోయినా అక్కడి ప్రజలకు మానవత్వం ఉందని నిరూపిస్తున్నారు..  తమ ఆకలి తీర్చుకోవడమే కాకుండా ఇతరుల ఆకలిని కూడా చల్లారుస్తున్నారు.. ఇక ఈ కరోనావల్ల ఎక్కువ కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటోంది పేదలే. రోజూ కూలి పనులు చేస్తే గానీ కడుపు నిండని వారు.. ఇప్పుడు చేతిలో పని కూడా లేక, జేబుల్లో డబ్బులు లేక వారు పడుతున్న అవస్థలు తెలిస్తే గుండె బరువెక్కుతుంది. అలాంటివారిని ఎవరు పట్టించుకుంటారు..? ప్రభుత్వమా..? ప్రజలా..? అని ఆలోచిస్తే నూరు శాతం పేదలకు ప్రభుత్వం అందించే సాయం చేరుతుందనే గ్యారంటీ లేదు. అందుకే.. ఇటలీ ప్రజలు ప్రభుత్వం గురించి ఆలోచించకుండా తమకి తామే తోటి మనుషులను కాపాడుకొనేందుకు ముందు కొస్తున్నారు.

 

 

ఇంటి నుంచి బయటకు రాకపోయినా.. కూడు, నీడ లేక రోడ్లపై తిరిగే పేదల కోసం తాము తయారు చేసుకున్న, నిల్వ ఉంచుకున్న ఆహారంలో కొంత వారికి ఇస్తున్నారు. ఈ సందర్భంగా తమ ఇళ్ల ముందు బుట్టలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఆహార పదార్థాలను ఉంచుతున్నారు. ఆహారం అవసరమైన వారు ఈ బుట్టలో ఉన్న ఫుడ్ తీసుకోవాలని చీటీ పెడుతున్నారు... నిజంగా మానవత్వం అంటే ఇదే కదా..  కోలుకోలేని విధంగా నష్టం సంభవించిన ఇటలీ ప్రజల మనసు వెన్నెలాంటిదని అర్ధం అవుతుంది..

 

 

ఇక మనదేశంలో పేదలకు అందవలసిన నిత్యావసరాలను.. శవాలమీద పేలాలు ఏరుకున్నట్లు దోచుకుని దాచుకునే పుండాకోరులు కాస్త సిగ్గుతెచ్చుకుంటే మంచిది.. చస్తే కావలసింది ఆరడుగుల భూమి అంతే కాని దాచుకున్న డబ్బును చచ్చాక బొందలో పోసి పూడ్చరు.. మానవత్వం. మంచితనం ఈ రెండు మనిషిగా గుర్తింపును ఇస్తాయి.. దాన్ని ఇప్పుడు వాడు.. కాస్తైనా స్వార్ధాన్ని వీడు.. లేదంటే ఎప్పుడో ఒకప్పుడు ఫలితం అనుభవించక తప్పదు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: