ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కనిపించని శత్రువుతో అలుపెరుగనిపోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు తమ తమ దేశాల్లో కరోనా  వైరస్ ను  నియంత్రించు నిర్బంధం లోకి వెళ్ళిపోయి లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలందరూ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేలా చేసి.. కరోనా  వైరస్ వ్యాపించకుండా చేయాలని ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ప్రజలు ఇంటికే పరిమితం అయ్యేలా ఉండేందుకు బాగానే కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల లాటి  ఛార్జీలు కూడా చేస్తున్నారు. 

 

 

 ఇలా కొన్ని దేశాల్లో లాక్ డౌన్  నేపథ్యంలో బయటికి వచ్చిన ప్రజలను ఇంటికి పంపేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం సీన్  కాస్త రివర్సయిపోయింది . పోలీసులు ప్రజల పై లాఠీఛార్జ్ చేయడం కాదు ప్రజలే పోలీసులపై తిరగబడ్డారు. ఇలాంటి దృశ్యాలు ఇండియాలోనే కాదు దాయాది దేశమైన పాకిస్థాన్లోని వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్  అమల్లో ఉన్న సమయంలో... కరాచీలోని లియాకత్బాద్ ఏరియా లో చాలా మంది ప్రజలు గుమిగూడారు. ఇక ఇది గమనించిన పోలీసులు వారిని చెల్లాచెదురు చేయడానికి వ్యాన్ లో  వెళ్లారు. 

 

 

 ఈ క్రమంలోనే వ్యాను కాస్త దూరంలో ఆపి లాఠీలతో పోలీసులు వారి వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న వారందరూ వెంటనే ఇళ్ళ లోకి వెళ్లి పోవాలంటూ వారికి హెచ్చరిక జారీ చేశారు. అప్పటికే నిత్యవసర వస్తువులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు. ఇక ఎక్కువ సంఖ్యలో ప్రజలు పోలీసులకు ఎదురు తిరగటంతో  ప్రాణాలకు ప్రమాదం అని గ్రహించిన పోలీసులు పరుగు పెడుతూ వ్యాన్ లోకి వెళ్లారు. అయినా వదలని  అక్కడి ప్రజలు... వ్యాన్  వెంట పరుగులు తీస్తూ పోలీసులను తరిమికొట్టారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షిస్తూ ఉంటే ప్రజలు ఇలా వ్యవహరించడం సరికాదంటున్నారు  చాలా మంది విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: