చీకటి పడిన తర్వాత ఆకాశంలో చంద్రుడిని చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పూట చిన్న పిల్లలకు అన్నం తినిపించడానికి తల్లులు చంద్రుడినే చూపిస్తారు. ఇక పెద్దలకు కూడా పౌర్ణమి రోజున నిండు చంద్రుడిని చూస్తే మనసు పులకరించిపోతుంది. అంతే కాకుండా ఈ మధ్య కొత్తగా పేర్లు పెట్టిన బ్లడ్ మూన్, సూపర్ మూన్ లు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. మరో మూడు రోజుల్లో సూపర్ మూన్ మనల్ని అలరించనుంది. చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే ఆ రోజున కనిపించే చంద్రుడిని ‘సూపర్‌మూన్‌ అని పిలుస్తారు. ఈ  నెల 7వ తేదీన పౌర్ణమి కావడంతో చంద్రుడు సూపర్‌ మూన్‌గా కనిపించనున్నాడు.

 

 

కొన్ని దేశాల్లో ఈ సూపర్ మూన్ ను రకరకాల పేర్లతో పిలుస్తారు. ఉత్తర అమెరికా ప్రాంతాల్లో దీనిని ‘పింక్‌మూన్‌’ అంటారు. ఇతర దేశాల్లో స్ర్పౌటింగ్‌ గ్రాస్‌ మూన్‌, ది ఎగ్‌ మూన్‌, ద ఫిష్‌మూన్‌ అని కూడా పిలుస్తుంటారు. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూమూన్ అంటారు. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. చందమామ సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తే దాన్ని సూపర్ మూన్‌ అంటారు. చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్.. ఈ మూడూ ఒకేరోజు వస్తే దాన్నే సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు.

 

 

అయితే ఒక సూపర్ మూన్, చంద్ర గ్రహణం మరియు ఒక బ్లూ మూన్ ఒకేసారి రావటం గత 150 సంవత్సరాలలో సంభవించలేదు. కాగా 2018 జనవరిలో సూపర్ మూన్, చంద్ర గ్రహణం మరియు ఒక బ్లూ మూన్ ఒకేసారి రావడంతో ఆ చంద్ర గ్రహణానికి ప్రత్యేకత ఏర్పడింది. అనేక దేశాల ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించారు. అప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దాన్ని స్పష్టంగా చూడగలిగారు. అయితే ఈసారి మాత్రం భారత దేశంలో ఈ సూపర్‌మూన్‌ కనపడదని, ఈ సారి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు మన దేశంలో సమయం 8వ తేదీ ఉదయం 8.05గా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న భారతీయులు మంచి అవకాశాన్ని కోల్పోయామని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: