క‌రోనా మ‌హ‌మ్మారిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న సెల‌బ్రిటీల‌తో పీఎం మోదీ స్వ‌యంగా అభినందిస్తున్నారు. శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్‌లో  క్రికెట్ గాడ్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ తెందూల్క‌ర్‌తో పాటు ఇండియ‌న్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు మ‌రికొంత‌మందితో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. అభిమానుల‌కు క‌రోనాపై జాగ్ర‌త్త‌లు చెప్పాల‌ని సూచించారు. క‌రోనాపై ముందు జాగ్ర‌త్త‌లే మ‌న‌ల్ని ర‌క్షిస్తాయ‌ని చెప్పారు. మీరు చెప్పే సూచ‌న‌లు, స‌ల‌హాలు ఈ మాన‌వాళి మ‌నుగ‌డ‌కు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయంటూ కోరారు. ప్ర‌ధాని నేరుగా వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ద్వారా త‌మ‌తో మాట్లాడ‌టంపై క్రీడాకారులు ఎంతో సంతోషించారు. 

 

త‌ప్ప‌కుండా మోదీ సూచ‌న‌లు త‌మ అభిమానుల‌కు తెలియ‌జేస్తామ‌ని సోష‌ల్ మీడియా వేదికగా తెలియ‌జేసిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా మోదీ టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, నాగ్‌ల‌పై కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు చైతన్యం కల్పిస్తూ చిరంజీవి, నాగార్జున, సాయి తేజ్‌, వరుణ్‌ తేజ్‌తో కలిసి సంగీత దర్శకుడు కోటి రూపొందించిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు ప్ర‌ధాన‌మంత్రి మోదీ తెలుగులో ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. 

 

ఇప్పటి వరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,653కు చేరుకుందని తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు  ప్రముఖులను ఎంచుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.  వారి ద్వారానే ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశాయి. కరోనా నుంచి ప్రజలను విముక్తి చేయడాన్ని బాధ్యతగా తీసుకున్న వివిధ రంగాల్లోని కొంత‌మంది   ప్రముఖులు… తమ వంతు ప్రయత్నంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారంద‌రినీ మోదీ క్ర‌మ‌క్ర‌మంగా అభినందిస్తూ వ‌స్తున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: