దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు దేశంలో 2,902 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది.  ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ తబ్లిగీ జమాత్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వారిలో ఈ కరోనా పాజిటీవ్ లు నమోదు అవుతున్నాయి.   నిన్న తూర్పు గోదావరి జిల్లాలో రెండు, విశాఖపట్టణంలో ఒక కేసు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 164కు పెరిగింది. ఇక, కోలుకున్న వారిలో ఒంగోలుకు చెందిన 23 ఏళ్ల కుర్రాడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

 

గత 24 గంటల్లో అత్యధికంగా 601 కేసులు నమోదయ్యాయని తెలిపింది. 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 12 గంటల్లో 355 కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ముంబై నుంచి వచ్చిన యువకుడి ద్వారా అత్త, బావమరిదికి కూడా కరోనా సోకింది. దీంతో విశాఖలో నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య 4కు చేరుకుంది.

 

తాజాగా కరోనా మహమ్మారికి ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. జిల్లాలోని హిందుపురానికి చెందిన ముస్తాక్‌ ఖాన్‌ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. అలాగే నలుగురు పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: