క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేస్తూ.. అనేక మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. అలాగే మ‌ర‌ణించిన వారి సంఖ్య  59,140కి చేసుకుంది. మొద‌ట చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్ప‌టికే 205 దేశాలకు వ్యాపించి మరణ మృదంగం మోగిస్తుంది. ఇక ఒకవైపు భారీగా పెరిగిపోతున్న కేసులు, వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించలేకపోవడంతో కొన్ని దేశాలు ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్నాయి.  

 

అయితే క‌రోనాను ఎలాగైన క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డ‌క‌క్క‌డ లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. దీంతో ప్ర‌జ‌లు ఎక్క‌డివారు అక్క‌డే లాక్ అయ్యారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఓ తండ్రి త‌న కుమార్తెను  కడసారి చూపునకు కూడా నోచుకోని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో దుబాయ్‌లో ఉన్న తండ్రి జగిత్యాల జిల్లా తుంగూరులో జరిగిన కూతురి అంత్యక్రియలను వీడియోకాల్‌లో చూసి బాధ‌ప‌డాల్సి వచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బీర్‌పూర్ మండలం తుంగూరులో పాలాజీ భాస్కర్, సునీత అనే దంపతులు నివ‌సిస్తున్నారు. 

 

వీరికి  పదకొండేళ్ల సాహిత్య అనే కుమార్తె కూడా ఉంది. అయితే తీవ్ర మధుమేహం సమస్య ఉన్న సాహిత్యను బతికించుకునేందుకు వైద్యం కోసం లెక్కలేనన్ని అప్పులు చేశారు భాస్కర్ దంపతులు. అయితే అప్పులు ఎక్క‌వ కావ‌డంతో వాటిని తీర్చేందుకు  పరాయి దేశం వెళితేనే కుదురుతుంద‌ని భాస్కర్ ఉపాధి వెతుక్కుంటూ కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఇంత‌లో సాహిత్యను మృత్యువు క‌బ‌ళించింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా భాస్కర్ రాలేని పరిస్థితుల్లో కుమార్తె కడసారి చూపునకు కూడా దూరమయ్యాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వీడియోకాల్‌లో కుమార్తె అంత్యక్రియులు చూస్తూ స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 
   

మరింత సమాచారం తెలుసుకోండి: