ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది. ప్ర‌పంచ‌మే కుగ్రామం అయిన నేప‌థ్యంలో ఎక్క‌డ ఏం జ‌రుగుతోందో.. ఎప్పుడు దేనిపై ఎలా స్పందించాలో ప్ర‌జ‌లు తెలిసినంత‌గా నాయ‌కుల‌కు కూడా తెలియ‌డం లేదు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. తాజాగా టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ ప్ర‌భుత్వం, ఆయ‌న నిర్ణ‌యాల‌పై విరుచుకుప‌డ్డారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాలను రెండు విడ‌త‌ల్లో ఇ వ్వడం స‌హా కేంద్రాన్ని సాయం చేయాల‌ని జ‌గ‌న్ అభ్య‌ర్థించ‌డాన్ని కూడా టీడీపీ నాయ‌కులు ఎత్తి చూపిం చారు. దీనిని మ‌హాప‌రాథంగా వారు పేర్కొంటూ.. ప‌ది నెల‌ల‌కే ఇంత బీద అరుపులా అని ప్ర‌శ్నించారు.

 

నిజానికి నిండు కుండ వంటి రాష్ట్రంగా, హైద‌రాబాద్ వంటి మెట్రో సిటీ నుంచి వ‌చ్చే ఆదాయంతో ఖ‌జానా ఎప్పుడూ క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని చెప్పుకొనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్ర ప్ర‌బుత్వ ఉద్యోగుల వేత‌నా ల్లో స‌గానికిపైగానే కోత విధించారు. అయినా ఆయ‌న‌ను ప్ర‌శ్నించేందుకు టీడీపీ నాయ‌కుల‌కు నోరు రాలేదు. కానీ, ఏపీలో ఎక్క‌డా ఉద్యోగుల వేత‌నాల్లో కోత విధించ‌క‌పోయినా(రెండు విడ‌త‌ల్లో ఇస్తామ‌న్నా రు), ప్ర‌ధానిని నేరుగా నిధులు ఇవ్వ‌మ‌ని, ఎక్విప్‌మెంట్లు ఇవ్వ‌మ‌ని అర్ధించినా.. ఇక్క‌డ జ‌గ‌న్‌ను ఆయ‌న ప్ర‌భుత్వాన్ని మాత్రం త‌ప్పు ప‌డుతూ.. తీవ్ర కామెంట్లు కుమ్మ‌రించారు. టీడీపీ నేత‌లు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిజ‌మే ప‌ది నెల‌ల‌కే రాష్ట్రం రూపాయి కోసం దేవుళ్లాడుకునే ప‌రిస్థితి క‌ల్పించింది మీరు కాదా? అని ప్ర‌శ్నించారు. 

 

ఐదేళ్ల చంద్ర‌బాబు కాలంలో ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసిన ప‌న్నుల‌ను, కేంద్రం వ‌చ్చిన అభివృద్ధి నిధుల‌ను మంచి నీళ్ల ప్రాయంలా ఖ‌ర్చు చేసి, ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌ను హైక్లాస్ చేసి ఖ‌ర్చు చేసింది మీరు కాదా? ఇక‌, బాబు చేసిన నిర్వాకం కార‌ణంగా అందిన కాడికి అప్పు తెచ్చుకుని త‌ర్వాత వ‌చ్చే ప్ర‌బుత్వం కేవ‌లం ఆ అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టేందుకే ప‌రిమిత‌మ‌య్యే ప‌రిస్థితి క‌ల్పించింది మీరు కాదా?  అని నిప్పులు చెరుగుతున్నారు. ఈ పది నెల‌ల కాలంలో ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తూ.. మీరు చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌డుతూ.. ఉన్న జ‌గ‌న్‌ను మెచ్చుకోక‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ, ఇలా నొచ్చుకునేలా వ్య‌వ‌హ‌రించడం ఏమాత్రం స‌మంజ‌సం కాద‌ని అంటున్నారు. మ‌రి త‌మ్ముళ్లు తెలుసుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: