చైనా డెవలప్ చేసిన టిక్ టాక్ అనే ఓ వీడియో క్లిప్ షేరింగ్ యాప్ ప్రపంచమంతటా వందల కోట్ల యూజర్లను సంపాదించింది. ఈ టిక్ టాక్ లో 99% చెత్త వీడియోలు, ప్రజలను తప్పుదోవ పట్టించే వీడియోలు, ప్రజలను చంపేసే దిక్కుమాలిన వీడియోలు ఉంటాయి. మిగతా 1% వీడియోలు మాత్రం ఇతరుల మనోభావాలను హర్ట్ చేసేలా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే టిక్ టాక్ ద్వారా ఓ మనిషికి ఏదైనా ఉపయోగం ఉందా అంటే... లేదనే చెప్పుకోవచ్చు. కానీ ప్రజలకు ఏ ఉపయోగం కల్పించకుండా... వారి సమయాన్ని మొత్తం దోచుకుంటూ... వేల కోట్ల రూపాయలను సంపాదించుకుంటుంది టిక్ టాక్ సంస్థ.


మన దేశంలో టిక్ టాక్ వినియోగమేమి తక్కువ కాదు. అందుకే కరోనా విపత్కర సమయంలో భారత్ కి రూ. 100 కోట్ల విలువైన రక్షణ వస్తువులను అందించింది. అవేంటంటే... 4 లక్షల మెడికల్ ప్రొటెక్టీవ్ సూట్లను, 20 వేల మాస్కులని కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసే డాక్టర్లకు ఉచితంగా అందచేయనున్నట్లు ప్రకటించింది. తాము హెల్త్ వర్కర్లకు, డాక్టర్లకు ఉచితంగా మెడికల్ ప్రొటెక్టీవ్ వస్తువులను అందజేస్తున్నామని... వాళ్లు ఆరోగ్యకరంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యకరంగా ఉంటారని అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సదరు సంస్థ తెలిపింది.


కానీ సోషల్ మీడియాలో భారతీయ నెటిజనులు మాత్రం టిక్ టాక్ ని బ్యాన్ చేయాలంటూ బలంగా డిమాండ్లు చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కొంతమంది టిక్ టాక్ వినియోగదారులు కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా జరగాలంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. అందుకే కొంత మంది భారతీయులు సామాజిక మాధ్యమాలలో టిక్ టాక్ ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం టిక్ టాక్ దృష్టికి వెళ్లగా... తాము ఇటువంటి వీడియోలను తొలగించేందుకు తగిన చర్యలను చేపడతామని... మీకు అభ్యంతరకరంగా అనిపించిన వీడియోలను రిపోర్ట్ చేస్తే ఆ వీడియోలను డిలీట్ చేయడం తో పాటు... అటువంటి వీడియోలను అప్లోడ్ చేసే యూజర్లను కూడా బ్యాన్ చేస్తామని టిక్ టాక్ హామీ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: