ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితం అయి.. కరోనా వైరస్ ను  నియంత్రించాలని పిలుపునిచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. దేశ ప్రధాని పిలుపు ఇచ్చిన లాక్ డౌన్ కి  ప్రజలందరూ సహకరిస్తూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో కేవలం ఇళ్లకు  మాత్రమే పరిమితమవుతున్నారు . అయితే అనంతరం జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించిన నరేంద్ర మోడీ... దేశ ప్రజలందరూ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో లైట్లు అన్ని ఆర్పేసి... కొవ్వొత్తులతో లైట్ దియా  పాటించాలని పిలుపునిచ్చారు. 

 

 

 అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చిన లైట్ దియా  అందరూ పాటించాలని ప్రముఖులు సైతం పిలుపునిస్తున్నారు. కాగా తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన లైట్ దియా  పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ప్రధాని నరేంద్ర మోడీ ఆయన మనస్సులో ఏముందో ఆయన చెబుతారు నా మనసులో ఏముందో నేను చెబుతాను అంటూ వ్యాఖ్యానించారు.  నేను ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనని ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ మంచి విషయం చెప్పారు అని మీ అందరికీ అనిపిస్తే ఆయన చెప్పింది పాటించండి అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా నా వ్యక్తిగత నిర్ణయం అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అన్నారు. 

 

 

 

 ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన రాత్రి 9 గంటల సమయంలో నాకు నిద్ర వస్తే నిద్ర పోతాను... కానీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విధంగా లైట్ దియ పాటించాలని ఏం లేదు. ప్రధాని నరేంద్రమోదీ మీకు చెప్పాడు కాబట్టి మీరు చేయండి. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాన్ని నన్ను ఎందుకు అడుగుతారు అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు  సంధించారు. నేను ఏం చేయగలనో అది  చెబుతా అని అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేయగలరో  ఆయన చెబుతారు అంటూ వ్యాఖ్యానించారు. కరోనా  వైరస్ ఎఫెక్ట్ వల్ల పశ్చిమ బెంగాల్లో ఎంతో నష్టం వచ్చినప్పటికీ తమ ప్రభుత్వం ఉద్యోగులకు సరైన సమయానికి వేతనాలు ఇస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: